ఈ-వేస్ట్ దీన్నే ఎలక్ట్రానిక్ వేస్ట్ అని కూడా అంటారు. ముఖ్యంగా మన ఇళ్లల్లో నిత్యం వాడే టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు, కంప్యూటర్లు, సిడి ప్లేయర్లు, అలాగే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు చాలా కాలం వాడిన తర్వాత పనికి రాకుండా పోతాయి. వాటిని ఒక స్టోర్ రూమ్ లో వాడకుండా పక్కన పారేస్తాము. అలాంటి వాటిని సేకరించి మీరు చక్కగా వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు.