Business Ideas: కొత్త బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా, రూ. 25 వేల పెట్టుబడితో నెలకు రూ. 50 వేల ఆదాయం

First Published Sep 19, 2022, 7:06 PM IST

కొత్త బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే తక్కువ పెట్టుబడి తోనే ఎక్కువ లాభం వచ్చే బిజినెస్ లో చాలా ఉన్నాయి. అలాంటి బిజినెస్ లను ప్లాన్ చేసుకుంటే మీరు చక్కటి ఆదాయం పొందే వీలుంది. మీకు ఫుడ్ బిజినెస్ పట్ల ఆసక్తి ఉన్నట్లయితే ఇందులో అనేక అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీరు మంచి లాభం పొందే వీలుంది.

ఫుడ్ బిజినెస్ లో లాభం మార్జిన్ బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ నాణ్యత క్రమశిక్షణ బిజినెస్ లోని కొన్ని మెలకువలను పాటిస్తే ఇది సాధ్యమవుతుంది. లేకపోతే ఫుడ్ బిజినెస్ లో కూడా భారీ నష్టాలు వచ్చే వీలుంది. అయితే ఫుడ్ బిజినెస్ చేసే ముందు ముందుగా చేయవలసింది మార్కెట్ పట్ల ఒక నిశితమైన పరిశీలన చేయాలి. అలా పరిశీలన చేయడం వల్ల మీకు ఏ సరుకు అమ్ముడు పోతుంది దేనికి డిమాండ్ ఉంటుందో తెలుసుకోవచ్చు.

ఇక ఫుడ్ బిజినెస్ లో ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సింది, ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో ప్రజలు దేని ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతున్నారో తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా విషయానికి వస్తే ఫ్రూట్ జ్యూస్ బిజినెస్...

నిజానికి ఫ్రూట్ జ్యూస్ అనగానే అందరిలోనూ, ఇది కేవలం సీజన్ అంటే సమ్మర్లో మాత్రమే నడిచే బిజినెస్ అని పొరపాటు పడుతుంటారు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న అవగాహన ఆరోగ్య అవగాహన దృశ్య అన్ని సీజన్లలోనూ ఈ ఫ్రూట్ చూసుకో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్లు డైటీషియన్లు ఫ్రూట్ జ్యూస్ తాగమని సిఫార్సు చేస్తున్నారు.

యువకులు అలాగే  పిల్లల్లో కూడా ఫ్రూట్ జ్యూసులు తాగమని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఒక ఫ్రూట్ జ్యూస్ పాయింట్ స్థాపిస్తే చక్కటి ఆదాయం పొందవచ్చు. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా ఒక ఫ్రూట్స్ స్టాల్ ను ఏర్పాటు చేసుకోవాలి. దీనికి మీరు ఒక షాపును అద్దెకు తీసుకోవచ్చు. లేదా మరి ఇతర వాణిజ్యసముదాయంలో అయినా ఒక స్టాల్ ను ఏర్పాటు చేసుకొని ఈ వ్యాపారం చేయవచ్చు.

సీజనల్ ఫ్రూట్స్ తో పాటు రెగ్యులర్ గా లభించే అన్ని రకాల తాజా పండ్లను అందుబాటులో ఉంచుకొని, మీరు ఈ వ్యాపారం తయారు చేయవలసి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒక సహాయకుడిని ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే ముందుగా మీరే తర్ఫీదు పొంది  ఈ ఫ్రూట్ జ్యూస్ స్టాల్ ను ఏర్పాటు చేసుకోవచ్చు.

సమ్మర్లో ఈ బిజినెస్ కు చాలా డిమాండ్ ఉంటుంది. అయితే సమ్మర్ కాకుండా మిగతా సీజన్లో కూడా డిమాండ్ ఉండాలంటే, మీరు నాణ్యతపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే కస్టమర్లకు నచ్చే విధంగా రెగ్యులర్ కస్టమర్లను పొందే విధంగా మీరు ప్యాకేజీలను కూడా సిద్ధం చేసుకుంటే చాలా మంచిది.

ఉదాహరణకు మీరు జిమ్నాజియం లేదా ఆసుపత్రుల సమీపంలో ఈ ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుంటే చక్కటి ఆదాయం పొందవచ్చు. ఎందుకంటే జిమ్నాజియంలోకి వచ్చే యువకులు నిత్యం తమ ప్రోటీన్ కోసం ఫ్రూట్ జూసెస్ సేవిస్తుంటారు. అలాగే ఆసుపత్రికి వచ్చిన రోగులు కూడా తేలిగ్గా అరిగే ఆహారం కోసం ఫ్రూట్ జ్యూస్ చేస్తుంది ఆధారపడుతుంటారు.

ఇక ఈ ఫ్రూట్ స్టాల్ పెట్టుబడే విషయానికి వస్తే దీనికి మీకు కావాల్సింది, ఒక కమర్షియల్ జ్యూసర్ మిక్సీ, అలాగే ఫ్రూట్ జ్యూసర్ మిషన్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. అలాగే జ్యూస్ లోకి ఐస్ బదులుగా మీరు ఒక కమర్షియల్ ఫ్రీజ్ ను ఏర్పాటు చేసుకొని అందులో పండ్లను పెట్టి జ్యూస్ చేసేస్తే చల్లటి జ్యూస్ సర్వ్ చేసే వీలు కలుగుతుంది. తద్వారా కస్టమర్లు కూడా ఈ కొత్తదనానికి ఫీల్ అవుతారు.

జ్యూస్ పాయింట్లపై చాలామందిలోనూ భయాలు ఉంటాయి. ఎందుకంటే తాజా పండ్లను వాడరని అలాగే చల్లదనం కోసం ఉపయోగించే ఐస్ లో నాణ్యత ఉండదని చాలామంది భావిస్తుంటారు. అయితే మీరు మాత్రం ఫ్రూట్ జ్యూస్ ఏర్పాటు చేసుకున్నప్పుడు, లాభం కన్నా ముందుగా నాణ్యత పై దృష్టి కేంద్రీకరించండి. తద్వారా మీకు కస్టమర్లు రెగ్యులర్ గా వస్తారు. అలాగే మీకు మా చక్కటి లాభం కూడా దక్కుతుంది

click me!