Business Ideas: షాపుతో పనిలేదు, ఇంటి వద్దే ఉండి స్మార్ట్ ఫోన్ ‌తో ఈ బిజినెస్ చేస్తే, నెలకు రూ. 2 లక్షల ఆదాయం..

First Published Jan 25, 2023, 5:50 PM IST

వ్యాపారం చేయడం ద్వారా చాలామంది ఈ మధ్యకాలంలో సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్  పెరిగిన తర్వాత ప్రస్తుతం వ్యాపారం చేయడం చాలా సులభంగా మారింది. అయితే వ్యాపారంలో  మీరు కొన్ని మెలకువలను పాటించినట్లయితే, ఇంట్లో కూర్చొని చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం. 

ఈ మధ్యకాలంలో వ్యాపారం చేసే వారిలో చాలామంది ఆన్‌లైన్  ద్వారా వ్యాపారం చేసేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.  ముఖ్యంగా ఆన్‌లైన్  వ్యాపారం ద్వారా మీరు అంతర్జాతీయంగా ఉన్న కస్టమర్లను కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంది మీ కస్టమర్ బేస్ కూడా చాలా పెరుగుతుంది.  షాపు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కేవలం ఒక గోడౌన్ మైంటైన్ చేస్తే చాలు తద్వారా మీరు వ్యాపారం సులభంగా చేసుకునే అవకాశం ఉంటుంది.  అలాగే నగదు లావాదేవీలు కూడా పారదర్శకంగా ఉంటాయి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పనులు సైతం సులభంగా చెల్లించే వీలు కలుగుతుంది. 

 మీరు ఆన్‌లైన్  ద్వారా వ్యాపారిగా మారాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసుకుందాం.  ఉదాహరణకు మీరు వస్త్ర వ్యాపారి అయినట్లయితే మీ వ్యాపార సంస్థలు ఏదైనా ఒక ప్రముఖ ఆన్‌లైన్  ప్లాట్ ఫాంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి  వెబ్ సైట్లో మీరు ఆన్‌లైన్   విక్రేతగా బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది.  ముఖ్యంగా ఆన్ లైన్ ద్వారా వస్త్ర వ్యాపారం చాలా డిమాండ్ ఉంటుంది.  ఉదాహరణకు మీరు హోల్సేల్ వ్యాపారి అయినట్లయితే.  మీ వద్ద ఉన్న దుస్తులను ఆన్‌లైన్  ద్వారా విక్రయించుకోవచ్చు. 

ముందుగా మీరు  ఆన్‌లైన్  విక్రతగా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్లో నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి జిఎస్టి నెంబర్ అవసరం.  అలాగే మీ కంపెనీ రిజిస్ట్రేషన్ కూడా అవసరం పడుతుంది.  తద్వారా మీరు ఆన్‌లైన్ విక్రేతగా నమోదు అవుతారు.  ఇక మీరు  అమ్మాలనుకుంటున్న వస్త్రాల డిజైన్లను  చక్కగా ఫోటో తీయించుకోవాలి.  లేదా మోడల్ చేత ఫోటో తీయించి ఆన్‌లైన్ లో పోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.  అలాగే మీరు ఆన్‌లైన్  ప్లాట్ ఫారం వారికి ధరను కూడా తెలపాల్సి ఉంటుంది. దీనిపై జిఎస్టి ఎంత వసూలు చేస్తారు. అలాగే మీకు ఎంత కమిషన్ దక్కుతుందో నిర్ణయించుకోవాలి. 

కస్టమర్లకు మీ డిజైన్స్ నచ్చినట్టయితే ఆన్‌లైన్  ద్వారా కొనుగోలు చేస్తారు వారికి మీరు డెలివరీ ద్వారా డెలివరీ చైన్ ద్వారా సప్లై చేయాల్సి ఉంటుంది.  అయితే మీరు పంపదల్చుకున్న వస్త్రం యొక్క ప్యాకింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కంపెనీ సూచించిన ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. డ్యామేజీలు లేకుండా  జాగ్రత్తగా చూసుకోవాలి. . రిటర్న్ పాలసీకి కూడా ఒప్పుకోవాలి.  కస్టమర్లకు మీ వస్త్రాలు నచ్చకపోతే వాటిని రిటర్న్ చేస్తుంటారు.  అలాగే దుస్తుల సైజుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే ఈ బిజినెస్ లో మీరు రాణిస్తారు. 
 

click me!