Business Ideas: మహిళలూ..మీ ఇంటి మీద స్థలం ఉందా.. అయితే ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 1 లక్ష సంపాదించే అవకాశం

First Published May 2, 2023, 4:07 PM IST

మహిళలు ఇంటి వద్ద ఉండే మీ ఖాళీ సమయాన్ని వినియోగించి చక్కటి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా.. అయితే మీ ఇంట్లో కొద్దిగా స్థలం ఉంటే చాలు… ఓ మంచి వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ వ్యాపారంలో రోజు కొద్ది గంటలు కష్టపడితే చాలు నెలకు కనీసం 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది.

ఈ మధ్యకాలంలో ఇంటి లోపల అలంకరణ అంటే ప్రతి ఒక్కరు ఇండోర్ ప్లాంట్స్ కొనేందుకు ఎక్కువగా ఇష్టం చూపిస్తున్నారు.  చూపిస్తున్నారు. చూపిస్తున్నారు. దీ దీన్నే మీరు ఓ మంచి వ్యాపార అవకాశం గా మార్చుకునే వీలుంది ఇండోర్ ప్లాంట్స్ పెంచడం కోసం మీరు ఒక నర్సరీ ప్రారంభిస్తే మీరు మంచి ఆర్డర్లను పొందే అవకాశం ఉంది. 
 

money

 మీ ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలం ఉంటే దాన్ని నర్సరీగా మార్చుకొని చక్కటి ఆదాయం పొందే వీలుంది. ముందుగా మీ ఇంటి ఆవరణలో 100 నుంచి 150 గజాల స్థలం ఉన్నట్లయితే చక్కటి నర్సరీ మెయింటైన్ చేయవచ్చు. లేదా మరో ఖాళీ స్థలం ఏదైనా ఉంటే దాన్ని అద్దెకు తీసుకొని కూడా నర్సరీ పెట్టుకోవచ్చు. ఒక పాలీహౌస్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. . తద్వారా మీరు మొక్కలను ప్రత్యక్షంగా కాపాడుకునే వీలుంది. మీ ఇంటి టెర్రస్ మీద కూడా నర్సరీ ఏర్పాటు చేసుకొని మొక్కలు విక్రయించవచ్చు. 

money

పాలీహౌస్ పద్ధతిలో మొక్కలను సంరక్షించినట్లయితే చీడపీడలకు గురి అయ్యే అవకాశం ఉండదు అలాగే వాటిని సంరక్షించడం కూడా చాలా సులభం. అధిక ఉష్ణోగ్రత, అధిక గాలులు అధిక వర్షం వంటి వాతావరణ పరిస్థితుల నుంచి మొక్కలను మనం కాపాడుకోవచ్చు. పాలీహౌస్ నిర్మాణానికి సుమారు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది.  ఇక పా ఇక పాళీ హౌస్ లో మీరు మొక్కల పెంపకంపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. 
 

 రాజమండ్రి సమీపంలోని కడియం  నర్సరీలలో అనేక రకాల ఇండోర్ ప్లాంట్స్ లభిస్తాయి వాటిని తెచ్చుకొని,  చిన్న చిన్న కుండీలలో అంటు కట్టడం పద్ధతి ద్వారా,  పెంచడం ద్వారా పెద్ద ఎత్తున  మొక్కలను మీరు ఏర్పాటు చేసుకోవచ్చు.  ఇక మీరు మొక్కలను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆర్డర్లను పొందాల్సి ఉంటుంది ముఖ్యంగా కొత్తగా ఇల్లు కట్టుకున్న వారు అదే విధంగా,  ఇంటిని అలంకరించుకోవాలి అనుకునే వారికి మీరు విజిటింగ్ కార్డు ద్వారా  పరిచయం చేసుకుంటే మంచిది. 
 

money

అదే విధంగా మీరు పబ్లిసిటీ కోసం డిజిటల్ మార్కెటింగ్,  సోషల్ మీడియా అలాగే నేరుగా  పాంప్లెట్ ల ద్వారా పబ్లిసిటీ చేస్తే మీ నర్సరీ గురించి నలుగురు మాట్లాడుకునే వీలుంది.  అదేవిధంగా మీరు మొక్కలలో వివిధ రకాలను అభివృద్ధి చేసి అందుబాటులో తెస్తే మంచిది.  అరుదైన వృక్షజాతులు పూలు అందించే మొక్కలు, పండ్లు అందించే మొక్కలను అందుబాటులో ఉంచుకుంటే మంచిది.

అలాగే ఔషధ మొక్కలకు కూడా మంచి డిమాండ్ ఉంది.  కావున ఔషధ మొక్కలను కూడా పెంచడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే వీలుంది. అదేవిధంగా మీరు నర్సరీ ద్వారా ప్రతినెల చక్కటి ఆదాయం పొందే వీలుంది.  మీకు ఆర్డర్లు పెరిగే కొద్దీ నెలకు 50 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

నోట్: పైన పేర్కొన్న బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆదాయాలు, వ్యయం కేవలం అంచనా మాత్రమే. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు, ఏషియా నెట్ తెలుగు వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు.

click me!