మొదట్లో మీరు చిన్న చిన్న ఈవెంట్స్ తో ప్రారంభిస్తే మంచిది. ఫ్యామిలీ ఫంక్షన్స్, బర్త్ డేలు, అదేవిధంగా పెళ్లిళ్లు వంటి ఈవెంట్స్ బుక్ చేసుకొని, చక్కటి ప్లానింగ్ తో వైభవంగా చూడ చక్కగా నిర్వహిస్తే మీకు మంచి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు ఓ బర్తడే ఈవెంట్ నిర్వహించాలి అనుకుంటే ముందుగా మీరు ఎంపిక చేసుకున్న ఫంక్షన్ హాల్ లేదా ఖాళీ ప్రదేశంలో డెకరేషన్ కోసం ఓ ప్రత్యేకమైన వ్యక్తిని కేటాయించాల్సి ఉంటుంది డెకరేషన్ అనంతరం ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. . మంచి కేటరింగ్ తో ఒప్పందం కుదుర్చుకోవాలి.