Business Ideas: మహిళలూ మీ ఇంట్లో ఒక్క గది కేటాయిస్తే చాలు...ఏడాదికి రూ. 10 లక్షలు మీ సొంతం..డిమాండ్ తగ్గదేలే..

Published : Apr 11, 2023, 06:10 PM IST

మహిళలు బిజినెస్ చేయడమే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఎందుకంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్తగా బిజినెస్ ప్రారంభించే వారికి రుణం అందించడానికి ముద్రా రుణాలను ప్రారంభించింది. ఈ రుణాలు అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లోనూ లభిస్తున్నాయి. మీరు గనుక వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంటే, మాత్రం ముద్ర రుణం ద్వారా అప్లై చేసుకుంటే 50 వేల నుంచి పది లక్షల రూపాయల వరకు రుణం పొందే వీలుంది. 

PREV
15
Business Ideas: మహిళలూ మీ ఇంట్లో ఒక్క గది కేటాయిస్తే చాలు...ఏడాదికి రూ. 10 లక్షలు మీ సొంతం..డిమాండ్ తగ్గదేలే..

ఇక మీరు ఏ వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తున్నారా… అల్లం వెల్లుల్లి పేస్టును విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందే వీలుంది.  ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన అల్లం వెల్లుల్లి పేస్టు లభించడం లేదు. దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందే వీలుంది.  ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ యూనిట్ను ఎలా స్థాపించాలి? ఎంత పెట్టుబడి అవుతుంది ఎలా మార్కెటింగ్ చేయాలో తెలుసుకుందాం. 

25

అల్లం వెల్లుల్లి పేస్టును విక్రయించాలంటే ముందుగా FSSAI Registration అనుమతి పొందాల్సి ఉంటుంది. అలాగే తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసుకోవడానికి మీ ఇంటి ఆవరణలో స్థలం ఉన్నట్లయితే, ఒక గది నిర్మించుకొని దానికి రేకుల షెడ్డు, ఏర్పాటు చేసుకోవాలి అలాగే కరెంటు సౌకర్యం ఉండేలా చూసుకోవాలి మీకు సహాయకులుగా ఒకరు లేదా ఇద్దరినీ పెట్టుకోవడం ద్వారా పని సులువు అవుతుంది
 

35

అల్లం వెల్లుల్లి నూరేందుకు గ్రైండర్ ను వాడాల్సి ఉంటుంది. కమర్షియల్ గ్రైండర్ ధర 20 వేల నుంచి 50 వేల వరకు ఉంటుంది. మీ వ్యాపారం పెద్ద స్థాయిలో ప్రారంభించాలనుకుంటే, ప్యాకేజింగ్ మెషిన్ కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర  1 లక్ష రూపాయల వరకు ఉంటుంది. ఇక అల్లం వెల్లుల్లి పేస్టును విక్రయించేందుకు మీరు వినూత్న పద్ధతులను పాటిస్తే మంచిది. . కర్రీ పాయింట్ హోటల్స్ అలాగే హాస్టల్స్,  క్యాటరింగ్ సర్వీసు చేసే వారికి అల్లం వెల్లుల్లి పేస్టు చాలా ముఖ్యమైన పదార్థం.  ప్రతి కూరలోనూ అల్లం వెల్లుల్లి పేస్టు నుండి తీరాల్సిందే
 

45

మీరు వారి నుండి ముందుగానే ఆర్డర్లను స్వీకరించి, మార్కెట్ కన్నా తక్కువ ధరకే నాణ్యమైన అల్లం వెల్లుల్లి పేస్టును సప్లై చేసినట్లయితే మీకు నిరంతరం ఆర్డర్లు వస్తూనే ఉంటాయి.  ఆర్డర్లను బట్టి పెట్టుబడి పెంచి,  మీ యూనిట్ సామర్థ్యం పెంచాల్సి ఉంటుంది. హోల్సేల్ మార్కెట్లో నాణ్యమైన అల్లం అదే విధంగా వెల్లుల్లిపాయలను కొనుగోలు చేసుకోవచ్చు.  తద్వారా మీకు ముడి సరుకు భారం తగ్గుతుంది. 
 

55

ఈ వ్యాపారంలో పెట్టుబడి కన్నా ముఖ్యమైనది నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడినా,  మీ వ్యాపారం దెబ్బ తినే ప్రమాదం ఉంది అందుకే నాణ్యమైన ముడి సరుకులు వాడి సప్లై చేసినట్లయితే నిరంతరం ఆర్డర్లు వస్తాయి.  అంతేకాదు ప్రతి సంవత్సరం లక్షల్లో ఆదాయం సంపాదించడం జరిగింది. 

Read more Photos on
click me!

Recommended Stories