అక్షయ తృతీయ రోజు బంగారం ధర రూ. 65,000 దాటిపోతుందని, ఇప్పటికే బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఎందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే బంగారం ధర అంతర్జాతీయంగా కూడా భారీగా పెరుగుతుంది. ఇప్పటికే అమెరికాలో ఒక ఔన్స్ అంటే 31 గ్రాముల బంగారం ధర 2000 డాలర్లు దాటిపోయింది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే మరో వారం రోజుల్లో బంగారం ధర రూ. 65, 000 దాటుతుందని అంచనా వేస్తున్నారు.