వెండి ధర పెరగడానికి కారణాలు.?
ప్రస్తుతం ప్రపంచదేశాలు గ్రీన్ ఎనర్జీపై దృష్టిసారిస్తున్నాయి. ముఖ్యంగా సౌర విద్యుత్ ఉపయోగం పెరుగుతుంది. అదే విధంగా ఎలక్ట్రానిక్ వెహికిల్స్ వాడకం ఎక్కువుతోంది. ఈ కారణంగానే వెండికి డిమాండ్ పెరగనుంది. గ్రీన్ ఎనర్జీకి వెండికి సంబంధం ఏంటనేగా మీ డౌట్. సోలార్ ప్యానెల్స్, సోలార్ సెల్స్ తయారీలో వెండిని ఉపయోగిస్తారు. అదే విధంగా వెండి-జింక్, వెండి-ఆక్సైడ్ బ్యాటరీలు అధిక సామర్థ్యంతో పనిచేస్తాయి. వీటితో పాటు టచ్ స్క్రీన్స్, ప్రింటెడ్ సర్క్యూట్స్, సెన్సార్లు, మైక్రోచిప్స్ వంటి వాటిలో కూడా వెండిని విరివిగా ఉపయోగిస్తున్నారు.