రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌.. 425 రోజుల వ్యాలిడిటీ. ధర ఎంతంటే..

First Published | Jan 13, 2025, 2:59 PM IST

ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రకరకాల ప్లాన్స్ తో యూజర్లను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఎక్కువ కాలం వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం ప్లాన్స్ ను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే కొత్తేడాదిలో కొన్ని కొత్త ప్లాన్స్ ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. అలాంటి కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఎక్కువ కాలం వ్యాలిడిటీతో పాటు అపరిమిత కాల్స్ ప్లాన్స్ కోసం ఎక్కువ మంది యూజర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని BSNL పలు ఆసక్తికర ప్లాన్స్ ను తీసుకొచ్చింది. 2025లో  ప్రభుత్వ రంగ టెలికం సంస్థ తీసుకొచ్చిన కొన్ని బెస్ట్ ప్లాన్స్ వివరాలు మీకోసం.. 

2025 బిఎస్ఎన్ఎల్ వార్షిక వ్యాలిడిటీ ప్లాన్‌లు

ఈ ఏడాది బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన బెస్ట్ ప్లాన్స్ లో రూ. 1198 ఒకటి. 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే కస్టమర్లకు 300 నిమిషాల వాయిస్ కాల్స్, 3 జీబీ డేటా పొందొచ్చు. అలాగే ఏడాది పాటు ప్రతీ నెల 30 ఉచిత SMSలు లభిస్తాయి. సెకండ్ సిమ్ గా ఉపయోగించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. 


బిఎస్ఎన్ఎల్ రూ.2099 ప్లాన్: ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 425 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో రోజుకు 2జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 10 SMS లు లభిస్తాయి. ఈ బెనిఫిట్స్ 395 రోజులు ఉంటాయి. అయితే ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే యాక్టివ్ ప్లాన్ 425 రోజుల వరకు ఉంటుంది. 

బిఎస్ఎన్ఎల్ రూ.2399 ప్లాన్: బిఎస్ఎన్ఎల్ రూ.2399 ప్లాన్ 425 రోజుల సర్వీస్ వ్యాలిడిటీ లభిస్తుంది. అయితే ఇందులో 395 రోజుల వరకు అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 2జీబీ డేటాతో పాటు రోజుకు ఉచితంగా 100 SMSలను పొందే అవకాశం కల్పించారు. 

బిఎస్ఎన్ఎల్ రూ.2999 ప్లాన్: బీఎస్ఎన్ఎల్ లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన ప్లాన్స్ లో ఇదీ ఒకటి. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3 జీబీ ఇంటర్నెట్ డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అదే విధంగా రోజుకు 100 SMS లను పొందొచ్చు. ఇందులో 365 రోజుల సర్వీస్ వ్యాలిడిటీ లభిస్తుంది. ఇదిలా ఉంటే బీఎస్ఎన్ఎల్ శరవేగంగా 4జీ సేవలను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. 

Latest Videos

click me!