దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. కారణం ట్రైన్ జర్నీ కాస్త సౌకర్యంగా ఉండటమే. ట్రైన్ జర్నీకి టికెట్ తప్పనిసరి. అయితే కొన్నిసార్లు అనుకోకుండా టికెట్ పోవడం, చిరిగిపోవడం జరుగుతుంటుంది. అప్పుడు ప్రయాణం చేయలేరు. రైలులో ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ టికెట్ పోతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డూప్లికేట్ టికెట్ తీసుకోవచ్చు.
24
డూప్లికేట్ టికెట్ ఎలా తీసుకోవాలి?
ఇండియన్ రైల్వే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. టికెట్ పోయినప్పుడు ప్రయాణికులకు ఇబ్బంది పడకుండా డూప్లికేట్ టికెట్ పొందేలా వీలు కల్పిస్తోంది. ఈ టికెట్ తీసుకోవాలంటే కొంత ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇందు కోసం ప్రయాణికుడు రిజర్వేషన్ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ పోయినట్లు సమాచారమివ్వాలి.
34
ఛార్జీలు ఇలా..
స్లీపర్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ టికెట్ కోసం నకిలీ టికెట్ తీసుకోవాలంటే 50 రూపాయిలు చెల్లించాలి. ఫస్ట్ క్లాస్ అయితే 100 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రైన్ టికెట్ చిరిగిపోతే టికెట్ ధరలో 25 శాతం చెల్లించి డూప్లికేట్ టికెట్ తీసుకోవచ్చు.
44
ఒరిజినల్ టికెట్ దొరికితే..
డూప్లికేట్ టికెట్ తీసుకున్న తర్వాత ఒరిజినల్ టికెట్ దొరికితే.. ప్రయాణం స్టార్ట్ కాకముందే రైల్వే అధికారులకు దాన్ని చూపించాలి. టిక్కెట్‌ను తిరిగి రైల్వే కౌంటర్‌లో ఇచ్చేసి డబ్బు తిరిగి తీసుకోవచ్చు.