జియోకి పోటీగా BSNL మరో అద్భుతమైన ఆఫర్: లేట్ చేస్తే మిస్సైపోతారు

First Published | Jan 7, 2025, 11:27 AM IST

BSNL మరో చక్కటి ఆఫర్ తో వినియోగదారుల ముందుకొచ్చింది. ఇప్పటికే తన వినియోగదారులకు మెరుగైన నెట్వర్క్ సౌకర్యం అందించాలని 4జీ సేవలను వేగంగా అమలు చేస్తున్న బీఎస్ఎన్ఎల్ మరో ఆఫర్ తీసుకొచ్చింది. అదనపు ఛార్జీలు విధించకుండా 1 ఇయర్ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ను పొడిగించింది. ఆ వివరాలు తెలుసుకుందాం రండి. 

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు వినియోగదారులను ఆకర్షించడానికి వివిధ ఆఫర్లను అందిస్తున్నప్పటికీ, ధరలను కూడా పెంచుతున్నాయి. అదే సమయంలో, ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే అద్భుతమైన ప్లాన్లను అందిస్తోంది. రోజువారీ డేటా, నెలవారీ ప్లాన్స్, వార్షిక సబ్‌స్క్రిప్షన్స్ ఇలా ప్రతి ప్లాన్ లోనూ పోటీ కంపెనీల కంటే తక్కువ ధరకే వాటిని అందిస్తోంది. 

14 నెలల వ్యాలిడిటీ పొడిగింపు

ప్రైవేట్ సంస్థలు 5G సేవలను అందిస్తున్నప్పటికీ బీఎస్ఎన్ఎల్ ఇంకా 4G సేవలను ప్రారంభించలేదు. అయినప్పటికీ తక్కువ ధరకే ప్లాన్లను అందిస్తుండటంతో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ ఒక ప్లాన్‌పై 14 నెలల వ్యాలిడిటీని ఉచితంగా అందిస్తోంది. ఈ ప్లాన్ గురించి తెలుసుకుందాం.

బీఎస్ఎన్ఎల్ రూ.2,399 రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీని ఒక నెల పాటు ఉచితంగా పొడిగించింది. ఈ ప్లాన్‌కు ఇంతకు ముందు 395 రోజులు అంటే సుమారు 13 నెలల వ్యాలిడిటీ ఉండేది. ఇప్పుడు ఈ ప్లాన్ వ్యాలిడిటీ 425 రోజులు అయ్యింది. అంటే 14 నెలల వరకు పొడిగించారు.


ప్రస్తుతం 4జీ సేవలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు వేగంగా పనులు చేస్తోంది. ఇప్పటికే కొన్ని ముఖ్య నగరాల్లో 4జీ సేవలను ప్రారంభించింది. 2025లోనే దేశవ్యాప్తంగా 4జీ సేవలు అందించడంతో పాటు 5జీ సేవలు కూడా అందిస్తామని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 

ప్రయోజనాలు ఏమిటి?

రూ.2,399 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ సదుపాయాన్ని లోకల్ గానే కాకుండా రోమింగ్ సేవలకు కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా 425 రోజులకు రోజుకు 2GB డేటా లభిస్తుంది. అంటే మొత్తం 850 GB డేటా లభిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు. అయితే స్పీడ్ 40kbps వేగం మాత్రమే ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే అదనంగా రోజుకు 100 SMSలు కూడా ఉచితంగా లభిస్తాయి.

జియోలో ఎలా ఉంది?

జియో రూ.3,599కి 365 రోజుల వ్యాలిడిటీతో వార్షిక ప్లాన్‌ను అందిస్తోంది. ఇందులో రోజుకు 2.5 GB డేటా లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌తో పోలిస్తే జియో ప్లాన్ ధర ఎక్కువ. వ్యాలిడిటీ మాత్రం తక్కువ. కాబట్టి 1 ఇయర్ ప్లాన్ కోరుకునే వారికి బీఎస్ఎన్ఎల్ మంచి ఎంపిక అవుతుంది. అయితే బీఎస్ఎన్ఎల్ ఇస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ ప్లాన్‌లో త్వరగా రీఛార్జ్ చేసుకోండి.

Latest Videos

click me!