2024 అయిపోయినట్టే.. ఈ సంవత్సరం మొత్తంలో ఏం సాధించామని ఆలోచిస్తే 90 శాతం మంది ఏం లేదనే చెబుతారు. ఎందుకంటే 2024 అంత స్పీడ్ గా అయిపోయింది మరి.. ఎప్పటికప్పుడు ఏదో చేయాలని అనుకోవడం, ప్లానింగ్ చేస్తుండగానే రోజులు గడిచిపోయాయి కదా.. ఎందుకంటే జీవితంలో మార్పు అంటే అదో పెద్ద విషయం. దాన్ని అంత త్వరగా ఆచరణలో పెట్టలేం. ఇదే చాలా మందిలో ఉన్న అభిప్రాయం.
అయితే నిజానికి జీవితం మారాలంటే పెద్ద మార్పులు అవసరం లేదని మానసిక నిపుణులు చెబుతున్నారు. డైలీ మనం జీవించే విధానంలోనే ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి చిన్న మార్పులు చేసుకుంటే ఆనందంగా జీవించొచ్చని చెబుతున్నారు. పాజిటివ్ గా ఆలోచిస్తూ చిన్న టిప్స్ పాటిస్తూ జీవిత గమనాన్ని ఎలా మార్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం రండి.
1. ప్రతి రోజూ కారులో వెళ్లేటప్పుడు అందరూ రేడియోని ఆన్ చేసి పాటలు వింటుంటారు. కాని రేడియోని ఆఫ్ చేసి, నిశ్శబ్దంగా డ్రైవ్ చేసి చూడండి. సైలెన్స్ లో ఉండే శక్తి మీకే అర్థమవుతుంది. ఆ సమయంలో వచ్చే నెగెటివ్ ఆలోచనలను పక్కకకు తోసేసి పాజిటివ్ గా ఆలోచిస్తూ డ్రైవ్ చేయండి. మీ అనేక సమస్యలకు మానసికంగా సొల్యూషన్ దొరుకుతుంది.
2. మీ భావోద్వేగాలను తెలపడం కోసం ఇతరుల మీద ఆధారపడవద్దు. మీ మనసుతో మాట్లాడండి. మీ భావాలు కరక్టో కాదో ఇన్నర్ వాయిస్ తో చర్చించండి.
3. ప్రకృతితో మమేకమై నడవండి. మీకిష్టమైన వ్యక్తులు లేదా పెంపుడు జంతువులను తీసుకొని అందమైన ప్రకృతి ఆస్వాధిస్తూ నడక సాగించండి. ఇది మీలో స్ట్రెస్ ని తగ్గించి, కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది.
4. మీ పిల్లలు మీకు ఎన్నో విషయాలు నేర్పుతారు.
వారితో స్వేచ్ఛగా, నిస్వార్థంగా మాట్లాడుతుంటే మీ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లోని సమస్యలకు కూడా పరిష్కారాలు లభించే అవకాశం ఉంటుంది.
5. ప్రతి రోజును పాజిటివ్ ఆలోచనలతో స్టార్ట్ చేయండి. ఇతరులతో దయతో ఉండండి. సాయం చేయండి. మీకు సాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత చూపండి. ఎదుటి వారిని ఇష్టపడటం కంటే మిమ్మల్ని మీరు ఎక్కువగా ఇష్టపడండి.
6. వాస్తవాన్ని అర్థం చేసుకోండి. మీరు అనుకున్నట్లు సమాజం, వ్యక్తులు లేరని చింతిస్తూ కూర్చోకండి. మీకు నచ్చని విషయాలను వదిలేసి ముందుకు వెళ్లిపోండి.
7. యోగ, ధ్యానం, శ్వాస మీద పట్టు సాధించేందుకు ప్రతి రోజు ప్రయత్నించండి. ఈ నైపుణ్యాలు మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి.
8. మీ శరీరం ఇస్తున్న సంకేతాలను అర్థం చేసుకోండి. అవి తెలుసుకోకపోవడం వల్లనే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ శరీరానికి అవసరమైన వ్యాయామం మాత్రమే చేయండి. శరీరాన్ని కష్టపెడుతూ, బలవంతంగా ఏదీ చేయొద్దు.
9. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ అయిపోకుండా, ఒక క్షణం ఆగి కూల్ గా స్పందించండి. ఇది మీ ఆలోచనా శక్తిని రెట్టింపు చేస్తుంది. ఈ చిన్న మార్పులు మీ జీవితంలో అద్భుతమైన మార్పును తెస్తాయి.