సరికొత్త రికార్డుకు నేడు బిట్‌కాయిన్ ధర.. 1200 గంటల సమయంలోనే 2.21 శాతం జంప్..

Ashok Kumar   | Asianet News
Published : Aug 23, 2021, 04:36 PM IST

నేడు బిట్ కాయిన్  ధర మొదటిసారి 50,000 డాలర్లకు చేరింది. కేవలం బిట్‌కాయిన్ మాత్రమే కాదు, ప్రపంచంలోని ఇతర క్రిప్టోకరెన్సీలు ఈతెరియం, బినాన్స్ కాయిన్, డాడ్జ్ కాయిన్ మొదలైనవి కూడా ఊపందుకున్నాయి. దీంతో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులకు భారీ ప్రయోజనం చేకూర్చింది. 

PREV
15
సరికొత్త రికార్డుకు నేడు బిట్‌కాయిన్ ధర.. 1200 గంటల సమయంలోనే 2.21 శాతం జంప్..

గ్లోబల్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ ఇప్పుడు 2.96 శాతం పెరిగి 21.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. గత 24 గంటల్లో క్రిప్టో మార్కెట్  మొత్తం వాల్యూమ్ 103.94 బిలియన్లు డాలర్లుగా ఉంది. Coinmarketcap.com ప్రకారం, ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ధర 1200 గంటల సమయంలో 2.21 శాతం పెరిగి 50,372 డాలర్లకు చేరుకుంది. ఏప్రిల్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కరెన్సీ బిట్‌కాయిన్  65,000 డాలర్ల వద్ద ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది.  ఈ వారంలో రెండు సానుకూల పరిణామాలు బిట్‌కాయిన్‌ ధరలో వేగంగా పెరుగుదలకు దారితీశాయి.

25

  బిట్ కాయిన్  జూన్‌లో  ఆరు నెలల కనిష్టానికి చేరుకుంది. ఇప్పుడు ఆ స్థాయి నుండి 70 శాతానికి పైగా పెరిగింది. త్వరలోనే 100,000 డాలర్లకు వైపు వెళ్ళవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. అయితే, బిట్‌కాయిన్ ఇప్పటికీ  రికార్డు ధరకి దూరంగా ఉంది, అయితే ఏప్రిల్‌లో బిట్‌కాయిన్ సుమారు 65,000 డాలర్ల స్థాయిని తాకింది.
 

35

Coinmarketcap.com ఇండెక్స్ ప్రకారం గత 24 గంటల్లో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ 2.88 శాతం పెరిగి 5,0409.16 డాలర్లకు చేరుకుంది. గత ఏడు రోజుల్లో బిట్‌కాయిన్ 6.15 శాతం లాభాన్ని నమోదు చేసింది.

45
Coinmarketcap.com ఇండెక్స్ ప్రకారం, ప్రపంచంలోని 10 అతిపెద్ద క్రిప్టోకరెన్సీల ధరలు ఉదయం 11 గంటల వరకు ఎలా ఉన్నాయంటే..

 బిట్ కాయిన్ - ధర 2.88 శాతం పెరిగి   5,0409.16 డాలర్లకు చేరుకుంది.
ఈతెరియం - ధర 3.55 శాతం పెరిగి  3346.78 డాలర్లకు  చేరుకుంది.
కార్డనో - ధర 11.60 శాతం పెరిగి  2.80 డాలర్లకు  చేరుకుంది.
బినాన్స్ కాయిన్ - ధర 7.37 శాతం పెరిగి  482.80 డాలర్లకు చేరుకుంది.
టెథర్ - ధర 0.03 శాతం పెరిగి  1.00 డాలర్లకు  చేరుకుంది.
ఎక్స్‌ఆర్‌పి - ధర 1.71 శాతం పెరిగి  1.25 డాలర్లకు  చేరుకుంది.
డాడ్జ్ కాయిన్ - ధర 2.17 శాతం పెరిగి 0.3229 డాలర్లకు చేరుకుంది.
పోల్కా డాట్ - ధర 3.52 శాతం పెరిగి 28.57 డాలర్లకు చేరుకుంది.
యూ‌ఎస్‌డి కాయిన్ - ధర 0.03 శాతం పెరిగి  1.00 డాలర్లకు చేరుకుంది.
సోలానా - ధర 0.67 శాతం తగ్గి   74.21డాలర్లకు  చేరుకుంది.
యుని స్వాప్- ధర 3.09 శాతం పెరిగి 29.46 డాలర్లకు చేరుకుంది.

55

యూ‌కేలో వినియోగదారులకు బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి అలాగే హోల్డ్ చేయడానికి పే పల్ హోల్డింగ్స్ ఇంక్ సంస్థ అనుమతించవచ్చని తెలిపింది. 

click me!

Recommended Stories