అలెర్ట్ : మీరు ఈ విషయాలను గుర్తుంచుకోకపోతే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది..

Ashok Kumar   | Asianet News
Published : Sep 13, 2021, 02:24 PM IST

 భారత ప్రభుత్వం  కరోనా కారణంగా దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. కరోనా కాలంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. దీంతో భారతీయ బ్యాంకులు సురక్షితమైన బ్యాంకింగ్ సదుపాయాలను అందించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. 

PREV
16
అలెర్ట్ : మీరు ఈ విషయాలను గుర్తుంచుకోకపోతే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది..

 ఒక వైపు భారత ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను అంటే దేశంలో నెట్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహిస్తుండగా మరోవైపు ప్రజలు డిజిటల్ లావాదేవీల కారణంగా మోసపోతున్నారు. ఆన్ లైన్ మోసాలు నివారించడానికి, సురక్షితమైన బ్యాంకింగ్ కోసం మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్ది  వినియోగదారులకు లాభదాయకంగా ఉండటమే కాకుండా వారికి మోసాలకు కూడా గురిచేయవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆన్ లైన్  మోసాలపై కేసులు ఎన్నో నమోదయ్యాయి, దీని నుండి నెట్ బ్యాంకింగ్ ద్వారా మోసగాళ్లు సులభంగా మీ బ్యాంక్ అకౌంట్‌ని యాక్సెస్ చేయగలరని స్పష్టమవుతుంది. 

 

దేశంలో టెక్నాలజీ అభివృద్ధితో, ఆన్‌లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలను మోసం చేయడానికి హ్యాకర్లు ప్రతిరోజూ కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. సైబర్ నేరాల సంఘటనలు ప్రతిరోజూ తెరపైకి వస్తున్నాయి, ఇందులో ప్రజల ఖాతాల నుండి లక్షల రూపాయలు స్వాహా అవుతున్నాయి. మోసగాళ్లు మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని ఎలా పొందుతున్నారో, వాటిని ఎలా నివారించాలో  తెలుసుకోండి...

26
ఫిషింగ్ ఇ-మెయిల్‌పై క్లిక్ చేయవద్దు

ఫిషింగ్ ఎటాక్ అనేది సైబర్ దాడికి పురాతన, సులభమైన పద్ధతి. ఫిషింగ్ దాడిలో ఇ-మెయిల్ ఐడిలు కూడా హ్యాక్ అవుతాయి. దీని కోసం హ్యాకర్లు మీ స్నేహితుల పేరుతో నకిలీ ఇ-మెయిల్‌లను పంపుతారు, ఇందులో వైరస్‌ లింక్‌లు ఉంటాయి. ఈ మోసాలని నివారించడానికి ఫిషింగ్ ఇమెయిల్‌పై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు ఇంకా ఆన్‌లైన్ చెల్లింపుల కోసం ఎల్లప్పుడూ వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని ఎంచుకోండి. ఇది మోసాల అవకాశాలను తగ్గించగలదు.

36
కార్డు క్లోనింగ్ ద్వారా మోసాలు ఎలా జరుగుతాయి..

కార్డ్ క్లోనింగ్ ద్వారా మోసగాళ్లు మీ ఏ‌టి‌ఎం కార్డుకు యాక్సెస్ పొందుతారు. దీని తరువాత వారు మిమ్మల్ని మోసం చేయడం పెద్ద విషయం కాదు. మీ ఏ‌టి‌ఎం కార్డును ఉపయోగించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మోసగాళ్లు ఏ‌టి‌ఎం మెషీన్ లో స్కీమర్ అనే మెషీన్ ఉంచారు. ఈ మెషీన్ కేవలం ఏడు వేల రూపాయలకే మార్కెట్లో సులభంగా లభిస్తుంది. ఈ మెషిన ద్వారా కార్డును స్వైప్ చేసినప్పుడు, కార్డు పూతి సమాచారం కాపీ చేస్తుంది. దీనిలో మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన మొత్తం సమాచారం ఉంటుంది. మోసగాళ్లు ఈ సమాచారాన్ని కొత్త కార్డుకు బదిలీ చేస్తారు. ఈ విధంగా మోసగాళ్లు మీ కార్డు పూర్తి వివరాలు ఉన్న మరొక కార్డును సృష్టించి, ఆపై దాని నుండి డబ్బును ఉపసంహరించుకుంటారు. 

46
ఎప్పటికప్పుడు పాస్‌వర్డ్‌ని మార్చండి

ఆన్‌లైన్ మోసాలని నివారించడానికి మీ పాస్‌వర్డ్‌ను సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం. మీ నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను మోసగాళ్లు హ్యాక్ చేయవచ్చు. అందుకే మీరు మీ పాస్‌వర్డ్‌ను ఎప్పటికప్పుడు మార్చుకోవడం ముఖ్యం. మీరు మీ పాస్‌వర్డ్‌లో ప్రత్యేక అక్షరాలు, నంబర్లు చేర్చినట్లయితే  మరింత సురక్షితంగా మారుతుంది. 

సురక్షితమైన నెట్‌వర్క్‌ను ఉపయోగించండి
ఆన్‌లైన్ మోసాలని నివారించడానికి మీరు అసురక్షిత వై-ఫై నెట్‌వర్క్ ద్వారా బ్యాంకింగ్‌ను ఉపయోగించకూడదు. మీరు ఇలా చేస్తే మీ సమాచారాన్ని సులభంగా హ్యాక్ చేయవచ్చు, దీని కారణంగా మీ బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ కావొచ్చు. అందువల్ల నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నప్పుడు మీరు పబ్లిక్ నెట్‌వర్క్‌లను ఉపయోగించకూడదు. 

56
నకిలీ ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా

సైబర్ నేరస్తులు ప్రజలను మరో విధంగా కూడా మోసం చేస్తున్నారు. అదేంటంటే  కస్టమర్లకు మెయిల్ లేదా ఎస్‌ఎం‌ఎస్ పంపుతారు. ఇందులో బ్యాంకులు కస్టమర్లకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే బోనస్ ఇస్తున్నట్లు పేర్కొంటుంది. దీనిని సద్వినియోగం చేసుకోవడానికి కస్టమర్‌లు ఎస్‌ఎం‌ఎస్ లో ఇచ్చిన లింక్‌ క్లిక్ చేసి చెప్పిన విధంగా  అనుసరిస్తారు తర్వాత వారి బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది.
 
సురక్షితమైన బ్రౌజర్‌ని ఉపయోగించండి 
మీరు ఎప్పుడైనా వేరిఫై లేదా సురక్షితమైన బ్రౌజర్‌ని మాత్రమే ఉపయోగించాలి. మీరు ఆన్ అతేంటికెటెడ్ సైట్ నుండి ఏదైనా యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మోసాలు జరిగే అవకాశం మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో బగ్ లేదా వైరస్ ఉండవచ్చు. దీనితో పాటు మీరు మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో మెరుగైన యాంటీ-వైరస్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంచాలి, తద్వారా మీరు వైరస్ లేదా సైబర్ దాడి ద్వారా అప్రమత్తమవుతారు. 

66
చుట్టూ రహస్య కెమెరాలు ఉండవచ్చు

మీ ఏ‌టి‌ఎం పిన్ తెలుసుకోవడానికి ఏ‌టి‌ఎంలో చుట్టూ రహస్య కెమెరాలు ఉంచవచ్చు అవి మీరు చేసే ప్రతిదాన్ని అన్నీ రికార్డ్ చేస్తాయి. అప్పుడు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. కార్డ్‌ని ఉపయోగించే ముందు, మెషీన్‌లో ప్రత్యేకంగా ఏదీ లేదని ముందుగా నిర్ధారించుకోవాలి. మీకు ఏవైనా అనుమానం ఉంటే అక్కడి సెక్యూరిటి  సిబ్బందిని అప్రమత్తం చేయండి.

 మీ నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్, ఓ‌టి‌పి, పిన్, కార్డ్ వెరిఫికేషన్ కోడ్ (CVV), యూ‌పి‌ఐ పిన్ ఎవరితో పంచుకోవద్దు. మీరు మీ పాస్‌వర్డ్‌ను మర్చిపోతే దాన్ని తెలివిగా రికవర్ చేసుకోండీ.

click me!

Recommended Stories