గ్యాస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. పెట్రోల్ తో పాటు వంటగ్యాస్ సిలిండర్ల ధర భారీగా పెంపు..

First Published Jul 1, 2021, 11:11 AM IST

చమురు కంపెనీలు ప్రతి నెలా 1 తేదీన ఎల్‌పిజి సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. ప్రతి రాష్ట్రానికి పన్ను వేరు వేరుగా ఉంటుంది తదనుగుణంగా ఎల్‌పిజి ధరలు మారుతూ ఉంటాయి.  ఎప్పటిలాగే ఈ నెలలో కూడా దేశంలోని చమురు మార్కెటింగ్ సంస్థలు 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ల ధరలను రూ .25.50 పెంచాయి. అంతేకాకుండా  19 కిలోల వాణిజ్య  సిలిండర్‌ ధర కూడా  రూ .76 పెంచారు.  

14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ ధరఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ .809 నుంచి రూ .834 కు పెరిగింది. కోల్‌కతాలో ధర రూ .835.50 నుంచి రూ.861 కు, ముంబైలో రూ .809 నుంచి రూ .834కు, చెన్నైలో రూ .825 నుంచి రూ .850కు పెరిగింది.
undefined
19 కిలోల సిలిండర్ ధరఢీల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ ధర గత నెలతో పోలిస్తే రూ.1550 చేరింది. గత నెలలో దీని ధర రూ.1473.50గా ఉంది. కోల్‌కతాలో దీని ధర రూ .1544.50 నుంచి రూ .1651.5 కు, ముంబైలో రూ .1422.50 నుంచి రూ .1507 కు, చెన్నైలో రూ .1603.00 నుంచి రూ .1687.5 కు పెరిగింది.
undefined
గత నెల మే, జూన్ నెలల్లో దేశీయ సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదు. ఏప్రిల్‌లో ఎల్‌పిజి సిలిండర్ల ధరను రూ .10 తగ్గించారు. ఈ ఏడాది జనవరిలో ఢీల్లీలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ .694 కాగా, ఫిబ్రవరిలో సిలిండర్‌ ధర రూ .719 కు పెంచారు. ఫిబ్రవరి 15న రెండవ సారి దీని ధర రూ.769 పెరిగింది. దీని తరువాత ఫిబ్రవరి 25న ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.794 కు సవరించారు. దీని తరువాత మార్చిలో రూ .819కు పెంచారు. ఎల్‌పిజి సిలిండర్ ధర 2021లో మొత్తంగా రూ.140.50 పెరిగింది. ఇక హైదరాబాద్ లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.877.50 చేరింది. గత నెల దీని ధర రూ.852గా ఉంది.
undefined
ఎల్‌పిజి సిలిండర్‌ను ఎలా బుక్ చేసుకోవాలంటే ?ఎల్‌పిజి సిలిండర్‌ను బుక్ చేసుకోవడానికి 8454955555 నంబర్‌కు కాల్ చేయండి లేదా మీరు వాట్సాప్ ద్వారా కూడా సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. రీఫిల్ అని టైప్ చేసి మీరు 7588888824 నంబర్‌కు మెసేజ్ పంపవచ్చు, దీంతో మీ సిలిండర్ బుక్ చేయబడుతుంది.
undefined
గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వ రాయితీప్రస్తుతం, కొంతమంది వినియోగదారులకు సంవత్సరంలో 14.2 కిలోల 12 సిలిండర్లపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది . వినియోగదారులు దీని కంటే ఎక్కువ సిలిండర్లను పొందాలనుకుంటే వాటిని మార్కెట్ ధర వద్ద కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల 1 తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవారిస్తుంటారు. దీని ధర సగటు అంతర్జాతీయ బెంచ్ మార్క్, విదేశీ మారక ధరల మార్పు వంటి అంశాల ద్వారా నిర్ణయించబడుతుంది.
undefined
click me!