యూఏఈలో ముఖేష్‌ అంబానీ వేల కోట్ల పెట్టుబడి.. క్లోర్‌ ఆల్కలీ, ఎథిలీన్‌ డైక్లోరైడ్, పీవీసీల తయారీ

First Published | Jun 30, 2021, 3:53 PM IST

ఆసియా అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అబుదాబి పెట్రోకెమికల్స్ సెంటర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ పెట్టుబడి మొత్తం గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. అయితే పెట్టుబడి వివరాలు వెల్లడికానప్పటికీ 150 కోట్ల డాలర్లు(సుమారు రూ. 11,100 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు అంచనా. 

ఈ నేపథ్యంలో టెలికమ్యూనికేషన్ నుండి చమురు వరకు సేవలను అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ యుఎఇ ప్రభుత్వ యాజమాన్యంలోని అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నోక్) రువాయిస్ ప్రాజెక్టులో పాల్గొంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అబూ ధాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏ‌డి‌ఎన్‌ఓ‌సి)ఒక కొత్త ప్రపంచ స్థాయి క్లోర్ ఆల్కలి, ఇథిలీన్ డైక్లోరైడ్, పాలీవినైల్ క్లోరైడ్ (పి‌వి‌సి) ఉత్పత్తి సౌకర్యం రువైసీలోని తజీజ్ లో ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది.
అబుధాబి ప్రభుత్వ ఇంధన దిగ్గజం అడ్నాక్, హోల్డింగ్‌ కంపెనీ ఏడీక్యూ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టాజిజ్‌ జేవీ పశ్చిమ అబుధాబిలో రువాయిస్‌ డెరివేటివ్‌ పార్క్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ జేవీతో ముఖేష్‌ అంబానీ చేతులు కలపనున్నారు. ఈ ప్రాజెక్టులో పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్‌ఐఎల్‌ తెలియజేసింది.

ఈ ఒప్పందం ఏ‌డి‌ఎన్‌ఓ‌సి, రిలయన్స్ శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది . ఈ ఒప్పందం పారిశ్రామిక ముడి పదార్థాల కోసం పెరుగుతున్న డిమాండ్ ని తీర్చడానికి సహాయపడుతుంది. 2025కల్లా కార్యకలాపాలు ప్రారంభించెందుకు అవకాశమున్న ఈ పార్క్‌ 500 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగలదని అంచనా. అబుధాబి జాతీయ చమురు కంపెనీ(అడ్నాక్‌) రోజుకి 3 మిలియన్‌ బ్యారళ్ల చమురును సరఫరా చేయనుంది. తద్వారా రువాయిస్‌లో డౌన్‌స్ట్రీమ్‌ కార్యకలాపాలకు తెరతీయనుంది. ఇందుకు వీలుగా భాగస్వాముల ద్వారా 45 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వెచ్చించాలని ప్రణాళికలు వేసింది. డౌన్‌స్ట్రీమ్‌ కార్యకలాపాల అభివృద్ధిలో భాగంగా రిఫైనింగ్, పెట్రోకెమికల్‌ సామర్థ్యాలను భారీగా పెంచుకోవాలని చూస్తోంది.
గ్రీన్ మార్క్ మీద రిలయన్స్ స్టాక్నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ లాభాలతో ట్రేడవుతోంది. గత రోజు 2087.80 వద్ద ముగిసిన స్టాక్స్ తరువాత ఈ రోజు 2,096.25 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .13.95 లక్షల కోట్లు.
సమాచారం ప్రకారం, ఈ వారం అబుదాబిలో దీనిపై అధికారిక ప్రకటన చేయవచ్చు. రెండు కంపెనీలు ఏడాదిన్నర క్రితం బ్రాడ్ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ద్వారా ఇంధన రంగంలో భారతదేశం, యుఎఇ మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అడ్నోక్‌తో రిలయన్స్ ఒప్పందం వృద్ధికి అవకాశం ఉంది. భారతదేశం వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ కార్యక్రమంలో ఈ సంస్థ మొదటి విదేశీ భాగస్వామి.

Latest Videos

click me!