Business Idea: చిన్న పట్టణాల్లో తక్కువ పెట్టుబడితో ఎలక్ట్రికల్, శానిటరీ, ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్‌లు ప్రారంభించి నెలకు రూ. 50 వేల వరకు లాభాలు పొందవచ్చు. తక్కువ పెట్టుబడితోనే మీ ఊరిలోనే లక్షల్లో సంపాదించే సూపర్ 3 బిజినెస్ ఐడియాలు మీకోసం.
తక్కువ పెట్టుబడితో 6 నెలల్లోనే డబుల్ గ్రోత్ ఇచ్చే టాప్ బిజినెస్ ఐడియాలు ఇవే
ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఉద్యోగాలను వదిలేసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే ఏ బిజినెస్‌లోనైనా సక్సెస్ అవ్వాలంటే మార్కెట్ స్టడీ చేయడం చాలా ముఖ్యం. సరైన అవగాహన లేకుండా దిగితే పెట్టిన పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
మీరు చిన్న పట్టణాలకు చెందిన వారైతే తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల అద్భుతమైన వ్యాపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ బిజినెస్‌లతో నెలకు రూ. 50,000 నుండి రూ. 1 లక్ష వరకు సంపాదించే వీలుంది. అంతేకాదు, కేవలం 6 నెలల్లోనే మీ వ్యాపార వృద్ధి రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంది.
26
చిన్న పట్టణాల్లో పెరుగుతున్న వ్యాపార అవకాశాలు
దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి చాలా వేగంగా జరుగుతోంది. కొత్త రోడ్లు, బైపాస్‌లు, హైవేల నిర్మాణం వల్ల రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా రోడ్డు పక్కన వ్యాపారాలకు భారీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో వందలాది చిన్న పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
ఈ క్రమంలో అక్కడ కొత్త ఇళ్లు, భవనాల నిర్మాణం ఊపందుకుంది. ఇలా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ఎలక్ట్రికల్, శానిటరీ, ఇంటీరియర్ డిజైనింగ్ షాపులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది.
36
ఎలక్ట్రికల్ షాప్
ప్రస్తుతం కరెంట్ కూడా ముఖ్యమైన ప్రాథమిక అవసరంగా మారిపోయింది. పట్టణీకరణ పెరుగుతుండటంతో కొత్త ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఈ ఇళ్లలో ఎలక్ట్రిక్ ఫిట్టింగ్, మోడ్రన్ లైటింగ్ పనులు భారీగా పెరుగుతున్నాయి. కాబట్టి ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభించడం చాలా లాభదాయకం. హోల్‌సేల్ మార్కెట్ నుండి రూ. 2 లక్షల విలువైన స్టాక్ తెచ్చుకుని చిన్న షాప్ మొదలుపెట్టవచ్చు.
ఒకవేళ మీరు అద్దె షాప్ తీసుకుంటే రెంట్, ఇతర అవసరమైన డాక్యుమెంట్ల కోసం అదనంగా రూ. 50,000 ఖర్చవుతుంది. ఎలక్ట్రికల్ వస్తువులపై సగటున 20 శాతం వరకు మార్జిన్ లభిస్తుంది. చిన్న పట్టణాల్లో కూడా నెలకు సగటున రూ. 1 లక్ష విలువైన సామాన్లు అమ్మవచ్చు. అన్ని ఖర్చులు పోను నెలకు రూ. 20 వేల నికర లాభం పొందవచ్చు. మీ సేల్స్ ను బట్టి రాబడి అనేది ఉంటుంది.
అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో శానిటరీ అండ్ ప్లంబింగ్ స్టోర్స్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ షాపుల్లో నల్లాలు, పైపులు, వాష్ బేసిన్లు, టాయిలెట్ సీట్లు, వాటర్ ట్యాంకులు, బాత్రూమ్ ఫిట్టింగ్ సామాన్లు అన్నీ దొరుకుతాయి. సాధారణంగా ఒక శానిటరీ స్టోర్‌లో సగటు గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 15 శాతం నుండి 30 శాతం మధ్య ఉంటుంది.
షాప్ అద్దె, కరెంట్ బిల్లు, స్టాఫ్ జీతాలు అన్నీ తీసేయగా 8 శాతం నుండి 15 శాతం వరకు నికర లాభం మిగులుతుంది. మీరు ఒక చిన్న స్థాయిలో ఈ స్టోర్ ప్రారంభించాలనుకుంటే ప్రారంభ పెట్టుబడి సుమారు రూ. 3 లక్షల వరకు అవుతుంది.
56
ఇంటీరియర్ డిజైనింగ్ షాప్
ఇంటీరియర్ డిజైనింగ్ షాప్ తెరవడం అనేది అత్యంత లాభదాయకమైన వ్యాపారం. ఎందుకంటే కొత్త ఇల్లు కట్టించుకునే వారు లేదా పాత ఇంటిని రినోవేట్ చేయించుకునే కస్టమర్లకు ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల తర్వాత ఇంటిని అందంగా అలంకరించుకునే వస్తువులు అవసరం అవుతాయి.
ఇంటీరియర్ డెకార్, వాల్ ప్యానెల్ షాప్ ప్రారంభించడానికి ప్రారంభ పెట్టుబడి రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు ఉండవచ్చు. ఈ బిజినెస్‌లో గ్రాస్ ప్రాఫిట్ 25 శాతం నుండి 45 శాతం వరకు లభిస్తుంది. షాప్ రెంట్, పనివాళ్ల కమీషన్, కరెంట్ ఖర్చులు పోను 15 శాతం నుండి 25 శాతం వరకు నికర పొదుపు ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొత్త ఇళ్లు, ఆఫీసులు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపులు నిర్మించుకునే వారందరూ మీకు కస్టమర్లుగా మారతారు.
66
మార్కెట్ అవగాహనతో ముందడుగు
చిన్న పట్టణాల్లో రూ. 2 లక్షల ప్రారంభ పెట్టుబడితో మొదలయ్యే ఈ వ్యాపారాలు సరైన ప్రణాళికతో నిర్వహిస్తే నెలకు రూ. 50,000 వరకు సంపాదించే గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి. స్థానిక అవసరాలను గమనించి, కస్టమర్లకు నాణ్యమైన వస్తువులను అందిస్తే తక్కువ సమయంలోనే మంచి గుర్తింపుతో పాటు స్థిరమైన ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చు.