Recharge plan: రోజూ 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌.. రోజుకు కేవలం రూ. 10 మాత్రమే..

Published : Feb 22, 2025, 12:26 PM IST

ప్రస్తుతం చేతిలో స్మార్ట్ ఫోన్‌లేకపోతే రోజు గడవని పరిస్థితి ఉంది. దీంతో అనివార్యంగా రీఛార్జ్‌ ప్లాన్స్ చేసుకోవాల్సిందే. ఇక మార్కెట్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు కూడా యూజర్లను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రకరకాల ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. అలాంటి కొన్ని బెస్ట్ ప్లాన్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
15
Recharge plan: రోజూ 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌.. రోజుకు కేవలం రూ. 10 మాత్రమే..

డేటా కోసమే రీఛార్జ్‌ చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. ఇందుకు అనుగుణంగానే కంపెనీలు సైతం యూజర్లను ఆకట్టుకుంటూ సరికొత్త ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెలికం సంస్థ జియో తన యూజర్ల కోసం మంచి ప్లాన్స్‌ను అందిస్తోంది. రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ లభిస్తున్న కొన్ని బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

25

రూ. 319 ప్లాన్‌.. 

నెల రోజుల పాటు నాన్‌స్టాప్‌గా సర్వీస్ ఉండాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే నెలరోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో ప్రతీ రోజూ 1.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ కూడా పొందొచ్చు. ఈ లెక్కన చూసుకుంటే రోజుకు రూ. 10 చెల్లిస్తే సరిపోతుందన్నమాట. అలాగే జియో సినిమా, జియోటీవీ, జియో క్లౌడ్‌ వంటి సేవలను ఉచితంగా పొందొచ్చు. 
 

35

రూ. 299 ప్లాన్‌: 

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతీ రోజూ 1.5 జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 42 జీబీ డేటా పొందొచ్చన్నమాట. వీటికి అదనంగా అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. 

45

రూ. 239 ప్లాన్‌: 

రూ. 239తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్లాన్‌ 22 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 33 జీబీ డేటా పొందొచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ ఉచితంగా పొందొచ్చు. డేటా పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి తగ్గుతుంది.
 

55

రూ. 199 ప్లాన్‌: 

జియో అందిస్తోన్న మరో బెస్ట్‌ ప్లాన్‌ ఇది. రూ. 199తో రీఛార్జ్‌ చేసుకుంటే 18 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో ప్రతీ రోజూ 1.5 జీబీ డేటా పొందొచ్చు. మొత్తం 27 జీబీ డేటా లభిస్తుందన్నమాట. అదే విధంగా రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. అలాగే జియో క్లౌడ్‌, జియో సినిమా వంటి యాప్స్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. 
 

click me!

Recommended Stories