3. Poco M6 ప్లస్
Poco M6 ప్లస్ 6.79-అంగుళాల LCD స్క్రీన్ తో ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటుంది. రిఫ్రెష్ రేట్ 120 Hz, ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణగా ఉంటుంది. అధిక బ్రైట్‌నెస్ మోడ్‌లో మాక్సిమ్ 550 నిట్‌ల బ్రైట్‌నెస్ అందిస్తుంది. దీని రిజల్యూషన్ 2400 x 1080 పిక్సెల్స్. ఈ ఫోన్ 5,030mAh బ్యాటరీని కలిగి ఉంది. 33W ఛార్జర్‌తో త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్‌తో పనిచేస్తుంది.
అన్ని గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ ఆపరేషన్‌లను నిర్వహించడానికి, ఇది Adreno A613 GPU కెపాసిటీని కలిగి ఉంది. Qualcomm Snapdragon 4 Gen 2 AE చిప్‌సెట్ ఇందులో ఉంది. 6 GB RAM/128GB స్టోరేజ్ కెపాసిటీ ఒక మోడల్ కాగా, 8 GB RAM/128 GB స్టోరేజ్ తో మరో మోడల్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ మినిమం ధర రూ.13,499, గరిష్ఠ ధర రూ.14,999.