అద్భుతమైన ఫీచర్స్ తో త్వరలో మార్కెట్ లోకి రానున్న కొత్త కార్లు ఇవే

First Published | Sep 7, 2024, 10:38 PM IST

ఇండియాలోని కార్ల మార్కెట్ లోకి త్వరలో అద్భుతమైన ఫీచర్స్ తో కొత్త కార్లు రానున్నాయి. కియా, మారుతి సుజుకి, హ్యుందాయ్ నుండి ఈ కొత్త మోడల్స్ రానున్నాయి. SUV మోడల్స్ కావడంతో మార్కెట్లో పోటీ పెరగనుంది. ఈ కొత్త మోడల్‌లు బోల్డ్ స్టైలింగ్, అధునాతన సాంకేతికత, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ మోడల్స్ లో ఉంటాయట. కొత్త కార్లకు సంబంధించిన మరిన్ని ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం. 

పెరిగిన డిమాండ్ కారణంగా ఇటీవల భారతదేశంలో 4 మీటర్ల కంటే తక్కువ SUVల మార్కెట్ గణనీయంగా పెరిగింది. టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ వంటి చిన్న SUVల విడుదలతో మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందింది. త్వరలో కొన్ని కొత్త మోడల్స్ రానున్నాయి. దీంతో మార్కెట్‌లో పోటీ మరింత పెరుగుతుంది. భవిష్యత్తులో రానున్న మినీ SUVలను ఇక్కడ పరిశీలిద్దాం రండి. 

కియా సిరోస్

2025 ప్రారంభంలో కియా తన కొత్త సబ్ 4 మీటర్ SUVని ఇండియాలో సిరోస్ లేదా క్లావిస్ పేరుతో ప్రారంభించాలని అనుకుంటోంది. SUV బాడీ క్లాడింగ్, రూఫ్ రైల్స్‌ను బోల్డ్ స్టైల్‌లో కలిగి ఉంటుందని టెక్ నిపుణులు అనుకుంటున్నారు. ADAS సాంకేతికత, సన్‌రూఫ్, లెదరెట్ అప్‌హోల్‌స్టరీ, హీటెడ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ డిస్క్ బ్రేక్‌లు వంటి అధునాతన పరికరాలు ఇందులో ఉంటాయట. ఇది ఎలక్ట్రిక్, పెట్రోల్ డ్రైవ్‌ట్రెయిన్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


మారుతి సుజుకి ఫ్రాంక్స్

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇండియా మార్కెట్లో ప్రారంభించినప్పటి నుండి ప్రజాదరణ పొందింది. 2025లో, మారుతి శక్తివంతమైన హైబ్రిడ్ డ్రైవ్‌ట్రెయిన్‌తో దీన్నే మోడల్ మార్చి ఫ్రాంక్స్‌ పేరుతో ఆవిష్కరించాలని అనుకుంటోంది. ఫ్రాంక్స్ ఇన్నర్, ఔటర్ మార్పులను కలిగి ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. హైబ్రిడ్ సాంకేతికత ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ కారు గురించి తక్కువ వివరాలు అందుబాటులో ఉన్నాయి.

హ్యుందాయ్ ఇన్‌స్టర్ EV

ఎలక్ట్రిక్ మైక్రో SUV మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, హ్యుందాయ్ 2026 చివరి నాటికి భారతదేశంలో ఇన్‌స్టర్ EVని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇన్‌స్టర్ EV టాటా పంచ్ EVతో పోటీపడుతుంది. 300-355 కి.మీల పరిధిని కలిగి ఉన్న రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. డ్యూయల్ డిస్‌ప్లేలు, క్లైమేట్ కంట్రోల్, ADAS, 360-డిగ్రీ కెమెరా ఇన్‌స్టర్ EVకి అదనపు ఆకర్షణలుగా ఉండవచ్చని చెబుతున్నారు.

Latest Videos

click me!