మీరు బస్‌ టిక్కెట్ బుక్‌ చేసుకోవాలనుకుంటున్నారా? బెస్ట్‌ 5 యాప్స్‌ ఇవిగో

First Published | Sep 8, 2024, 12:02 PM IST

మీరు తరచూ బస్‌ బుక్‌ చేసుకొని లాంగ్‌ టూర్‌ వెళుతుంటారా? మీ సొంత ఊరికి, ఉద్యోగం చేసే నగరానికి వెళ్లి వస్తూ ఉంటారా? బస్‌ బుక్‌ చేసుకుంటే అది టైమ్‌కు వస్తుందో లేదో తెలుసుకోవడానికి అనేక రకాల యాప్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బెస్ట్ 5 యాప్స్‌ గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 
 

ఇప్పుడున్న కాలంలో ఎంత దూర ప్రయాణమైనా ఈజీగా చేసేయొచ్చు. సాధారణంగా చాలా లాంగ్‌ టూర్‌ వెళ్లడానికి ట్రైన్‌, ఎరోప్లేన్‌ బుక్‌ చేసుకుంటాం. అయితే బస్సుల్లో కూడా లాంగ్‌ టూర్‌ వెళ్లొచ్చు. జర్నీ చేయడం అంటే ఇష్టమైన వారికి బస్సు ప్రయాణం చాలా ఆనందాన్ని ఇస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాలను చూసుకుంటూ వెళ్లడం చాలా బాగుంటుంది. 

కొందరు ఉద్యోగులు వీకెండ్‌ వచ్చిందంటే సొంత ఊరికి, ఉద్యోగం చేసే నగరానికి అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తుంటారు. ట్రావెలింగ్‌ అంటే ఇష్టపడే మరికొందరు జాబ్‌లో సెలవు దొరికితే లాంగ్‌ టూర్‌ చెక్కేస్తుంటారు. ఇలాంటి వారికి ఉపయోగపడే బస్‌ బుకింగ్‌ యాప్స్‌,  బస్‌ ట్రాకింగ్‌ ఫెసిలిటీస్‌ ఉన్న యాప్స్‌ చాలా ఉన్నాయి. వాటిల్లో బెస్ట్‌ యాప్స్‌ గురించి వివరాలు ఇవిగో..
 

paytm

* పేటీఎం(Paytm)
Paytm ప్రధానంగా ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించినది. ఇది బస్‌, ట్రైన్‌, ఫ్లైట్‌ టిక్కెట్ల బుకింగ్‌కు విలువైన సేవలందిస్తోంది. ఇది ఇండియా మొత్తంగా సేవలందిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం డిల్లీ లోని నోయిడాలో ఉంది. పేటీఎం ఇంతకు ముందు వరకు సినిమా టిక్కెట్లను బుక్‌ చేసే యాప్‌గా చాలా మందికి పరిచయం ఉంది. అయితే ఇటీవల ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగాన్ని ఫుడ్‌ డెలివరీ యాప్‌ అయిన జొమాటోకి విక్రయించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బస్‌, ట్రైన్‌, ఫ్లైట్‌ టిక్కెట్ల బుకింగ్‌లను పేటీఎం అందిస్తోంది. 

బస్సు టికెట్ బుకింగ్, ట్రాకింగ్, సమయానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యాప్‌లో పొందవచ్చు. రియల్-టైమ్ లో బస్ స్టేటస్ తెలుసుకోవడంలో పేటీఎం బాగా ఉపయోగపడుతుంది. 
 


* ట్రావెల్‌ యారీ(Travelyaari)
Travelyaari అనేది ఒక వెబ్‌సైట్‌. బెంగుళూరులో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ వెబ్‌సైట్‌లో 3,500 కంటే ఎక్కువ బస్సు ఆపరేటర్లు లింక్‌ అయి ఉన్నారు. 45,000 రూట్లలో రోజుకు 1,50,000 బస్సులను జనం ఎంపిక చేసుకొని నిత్యం వారి గమ్యస్థానాలకు ప్రయాణిస్తుంటారు. ఇది ఇప్పటి వరకు 150 మిలియన్ల బస్సు ప్రయాణికులకు సేవలందించింది . ఇది మాంటిస్ టెక్నాలజీస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రతిరోజూ 1,50,000-2,00,000 బస్ టిక్కెట్‌లను బుక్ చేస్తుంది. ఇది 8,000-9,000 ఆఫ్‌లైన్ ట్రావెల్ అవుట్‌లెట్‌లను బస్సు టిక్కెట్‌లను బుక్ చేయడంలో వారికి సహాయం చేస్తుంది.

బస్ బుకింగ్, రియల్-టైమ్లో బస్సు ట్రాకింగ్ చేయడానికి ఈ వెబ్‌సైట్‌ సహాయపడుతుంది. జర్నీ టైమింగ్‌ను పర్‌ఫెక్ట్‌గా అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. బస్సు సమయానికి సంబంధించి ప్రీసైజ్ డేటాను కూడా ట్రావెల్‌ యారీ అందిస్తుంది.
 

* రెడ్‌ బస్‌(RedBus)
red Bus ఇండియాలో ఆన్‌లైన్ బస్ టిక్కెట్ బుకింగ్ చేసే సంస్థ. రెడ్‌ బస్‌ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ల ద్వారా బస్సు టిక్కెట్ బుకింగ్‌ సౌకరాన్ని అందిస్తోంది. బెంగుళూరులో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. రెడ్‌ బస్‌ కేవలం ఇండియాలోనే కాకుండా మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, పెరూ, కొలంబియా దేశాల్లోనూ సేవలందిస్తోంది. సుమారు 3,500 కంటే ఎక్కువ బస్సు ఆపరేటర్ల నెట్‌వర్క్‌కు మీడియేటర్‌గా వ్యవహరిస్తోంది. ఇది 20 మిలియన్లకు పైగా కస్టమర్లకు రెగ్యులర్‌గా సేవలందిస్తోంది. ఇప్పటి వరకు 180 మిలియన్ ట్రిప్‌లను నమోదు చేసిందని ఆ సంస్థ పేర్కొంది.

బస్‌ బుకింగ్ ట్రాకింగ్, రియల్-టైమ్ లో బస్ పికప్ లొకేషన్, అప్‌డేట్‌లను అందిస్తోంది. ప్రయాణ సమయం, గమ్యస్థానానికి చేరే సమయం తెలుసుకోవడానికి రెడ్‌ బస్‌ బాగా ఉపయోగపడుతుంది.
 

* మేక్‌ మై ట్రిప్‌(Make My Trip)
MakeMyTrip లిమిటెడ్ అనేది ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ. దీన్ని 2000లో స్టార్ట్‌ చేశారు. దీని ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉంది. ఈ సంస్థ విమానయాన టిక్కెట్లను, దేశీయ, అంతర్జాతీయ సెలవు ప్యాకేజీలు, హోటల్ రిజర్వేషన్‌లు, రైలు, బస్సు టిక్కెట్‌లతో సహా ఆన్‌లైన్ ప్రయాణ సేవలను అందిస్తుంది. ఈ కంపెనీ 100 నగరాల్లో 146 ఫ్రాంఛైజీలను కలిగి ఉంది. మేక్‌మైట్రిప్‌కు న్యూయార్క్, సింగపూర్ , కౌలాలంపూర్, ఫుకెట్ , బ్యాంకాక్, దుబాయ్, ఇస్తాంబుల్‌లలో అంతర్జాతీయ కార్యాలయాలు కూడా ఉన్నాయి. 

బస్ బుకింగ్, ట్రాకింగ్, ప్రయాణ వివరాలు, నోటిఫికేషన్లు అందిస్తూ ప్రయాణికులకు ఎప్పటికప్పుడు చక్కటి సేవలందిస్తోంది. మీరు బుక్ చేసిన బస్సు ఎక్కడ ఉందో ట్రాక్ చేసి గమ్యస్థానం వివరాలు దీని ద్వారా పక్కాగా తెలుసుకోవచ్చు.
 

* అభిబస్‌(AbhiBus)
అభిబస్‌ యాప్‌ 2008లో స్టార్ట్‌ చేశారు. ఇది ఎండ్-టు-ఎండ్ సాఫ్ట్‌వేర్, ఇ-టికెటింగ్ సిస్టమ్స్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ వంటి సదుపాయాలను అందిస్తోంది. ఇది వినియోగదారులకు 24x7 సేవలందిస్తుంది.  ఈ యాప్, వెబ్‌సైట్‌లో 4000 కంటే ఎక్కువ బస్సులు లింక్‌ అయి ఉన్నాయి. 3,50,000 రూట్లో తిరిగే బస్సులను అభిబస్‌ ట్రాక్‌ చేస్తుంది. ఇండియా మొత్తం మీద 300 కంటే ఎక్కువ ప్రైవేట్ బస్సు యజమానులు ఈ యాప్‌తో లింక్‌ అయి ఉన్నారు. 5 రాష్ట్ర రవాణా సంస్థలకు, 2 అంతర్జాతీయ బస్సు భాగస్వాములకు అభిబస్‌ సేవలందిస్తోంది. 

బస్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవడానికి, తర్వాత బస్ రియల్-టైమ్ ట్రాకింగ్ చేయడానికి, ఎస్‌ఎంఎస్‌, ఈ మెయిల్‌ ద్వారా బస్‌ అప్డేట్స్ పొందవచ్చు. ఆన్‌లైన్ బుక్ చేసిన తర్వాత, బస్సు ఎక్కడ ఉందో రియల్-టైమ్ లో తెలుసుకోవచ్చు.
 

Latest Videos

click me!