ఐటీ రిటర్న్స్... చేయడం వల్ల లాభాలివే...

First Published Jul 22, 2019, 1:26 PM IST

పరిమితికి మంచి ఆదాయం ఉన్నవారు మాత్రమే కాదు... పన్ను పరిమితి లోపు ఆదాయం ఉన్నవారు కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఉద్యోగం, వృత్తి, వ్యాపారం... ఏదైనా సరే.. ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం... పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు కచ్చితంగా ఆదాయపు రిటర్నులు దాఖలు చేయాల్సిందే. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రిటర్నులు దాఖలు చేయడానికి ఆఖరి రోజు దగ్గరపడుతోంది. ఇంకా కేవలం పది రోజులు మాత్రమే గడువు ఉంది. అయితే... ఈ ఐటీ రిటర్న్స్ చేయడం వల్ల మనకు తెలీకుండానే భవిష్యత్తులో చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
undefined
పరిమితికి మంచి ఆదాయం ఉన్నవారు మాత్రమే కాదు... పన్ను పరిమితి లోపు ఆదాయం ఉన్నవారు కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
పన్ను వర్తించే ఆదాయం లేనప్పుడు రిటర్న్స్ చేయాల్సిన అవసరం ఏంటని చాలా మంది భావిస్తుంటారు. అది తప్పు.. ఆదాయం పరిమితిలో ఉన్నా కూడా రిటర్న్స్ దాఖలు చేయాలి. కొందరు ఒకే సంతవ్సరంలో రెండు ఉద్యోగాలు మారుతూ ఉంటారు. వాళ్లు కూడా తమ ఆదాయాలన్నింటినీ ఒక చోటకు తీసుకు వచ్చి మరీ రిటర్న్స్ దాఖలు చేయాలి.
undefined
బీమా పాలసీలు... ఐటీరిటర్న్స్ చేయడం వల్ల కలిగే లాభాల్లో ఇది కూడా ఒకటి. ఎక్కువ మొత్తంలో జీవిత బీమా పాలసీ తీసుకోవాలని అనుకున్నప్పుడు మీకు అంత ఆదాయం ఉందనే ఆధారం అవసరం. దీనికోసం బీమా కంపెనీలు మీ ఆదాయ పన్ను రిటర్స్స్ ని అడిగే అవకాశం ఉంది. దాదాపు మూడు సంవత్సరాల ఐటీ రిటర్స్ వివరాలను సేకరించి.. దానిని బట్టి మీకు బీమా కంపెనీలు ఎంత పాలసీలు ఇవ్వాలో నిర్ణయించుకుంటాయి.
undefined
కారులోన్, హౌసింగ్ లోన్... భవిష్యత్తులో మీరు ఇళ్లు లేదా కారు కొనాలని అనుకుంటే మాత్రం కచ్చితంగా మీ దగ్గర కనీసం మూడు సంత్సరాల ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు ఆధారాలు ఉండాలి.
undefined
వ్యాపారంలో నష్టం... మీకు వ్యాపారంలోగానీ, స్టాక్ మార్కెట్లలో గానీ నష్టం వాటిల్లితే... దానిని ఐటీ రిటర్నులలో చూపించి.. వచ్చే సంవత్సరాలకు బదిలీ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన లాభాలతో ఈ నష్టాలను సరిచేసుకునే అవకాశం ఉంది.
undefined
విదేశీ పర్యటనలు... ప్రస్తుత కాలంలో విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం వెళ్లేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అయితే... ఇలా విదేశాలకు వెళ్లాలనుకునేటప్పుడు వీసా కోసం కచ్చితంగా ఆదాయపు ధ్రువీకరణలు అవసరం. దీనికి రిటర్నుల పత్రాలు కచ్చితంగా అవసరమవుతాయి. చాలా దేశాలు తమ దేశపు వీసా ఇచ్చేందుకు ఆదాయ వివరాలను అడుగుతాయి.
undefined
స్వయం ఉపాది... ఏదైనా కంపెనీలో పనిచేసి ఉద్యోగాలు చేసేవారికైతే నెల నెలా జీతాలు వస్తాయి. దాంతో వారు ఎంత సంపాదిస్తున్నారో తెలుస్తుంది. అలా కాకుండా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఆదాయం గురించి కచ్చితమైన అంచనా ఉండదు. అలాంటి సందర్భాల్లో ఆదాయాన్ని ధ్రువీకరించుకోవడానికి రిటర్నులు ఉపయోగపడతాయి.
undefined
నో బ్లాక్ మనీ..ఓన్లీ వైట్ మనీ... లెక్కల్లో చూపించని ఆదాయం మీ దగ్గర ఉంటే అది చట్ట విరుద్దం. దానినే బ్లాక్ మనీ అంటారు. ఏదైనా తేడా వస్తే ఈ బ్లాక్ మనీ మీకు చిక్కులు తెచ్చి పెడుతుంది. అదే ప్రతి సంవత్సరం మీకు వచ్చే ఆదాయన్ని రిటర్స్ దాఖలు చేస్తే.. అది వైట్ మనీ అవుతుంది. దాని వల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉండవు.
undefined
ఎవరికి ఏ ఫారం... ఆదాయపన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ ద్వారా మీరు ఐటీ రిటర్న్స్ చేయాల్సి ఉంటుంది. అసెస్ మెంట్ ఇయర్ 2019-20కు సంబంధిచి ఐటీఆర్ ఫారాలను ఎంచుకోవాలి. రూ.50లక్షలలోపు ఆదాయం ఉన్నవారు ఐటీఆర్-1 ని ఎంచుకోవాలి. వేతనం లేదా పింఛను, ఒక ఇంటి ద్వారా ఆదాయం, ఇతర మార్గాల ద్వారా ఆదాయం వచ్చిన వారు దీన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ ఐటీఆర్‌-1 వర్తించని సందర్భంలో ఐటీఆర్‌-2లో రిటర్నులు సమర్పించాలి. వృత్తి, వ్యాపారం నిర్వహించేవారు.. ఐటీఆర్‌ 3, ఐటీఆర్‌ 4లలో రిటర్నులు దాఖలు చేయాలి.
undefined
click me!