బ్యాంక్ హాలిడేస్ లిస్ట్: ఈ సంవత్సరం మొదటి నెలలో 16 రోజుల పాటు ఈ తేదీలలో బ్యాంకులు బంద్..

First Published Jan 1, 2022, 2:44 PM IST

కొత్త సంవత్సరం 2022 ప్రారంభమైంది. కొత్త ఏడాదిపై ప్రజలకు కొత్త ప్రణాళికలు, కొత్త ఆశలు ఉంటాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే బ్యాంకులకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని చేయాలనే ఆలోచన ఉన్నట్లయితే, ఈ వార్త మీకోసమే. నిజానికి జనవరిలో మొత్తం 16 రోజులు బ్యాంకులు(banks) మూతపడనున్నాయి. అందుకే సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

కొత్త సంవత్సరం మొదటి రోజున అంటే నేడు ప్రభుత్వ అలాగే ప్రైవేట్ రంగ బ్యాంకులకు సెలవు. అలాగే ఈ నెలలో వివిధ సెలవుల కారణంగా 16 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అంటే ఏడాది తొలి నెలలోనే బ్యాంకు ఉద్యోగులకు భారీగా సెలవులు రానున్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంకులకు వేర్వేరు రోజుల్లో సెలవులు ఉండటం గమనార్హం.  

రాష్ట్రాలలో సెలవులు మారుతూ ఉంటాయి
వివిధ పండుగల కారణంగా జనవరిలో చాలా రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించింది. అయితే, మీరు ఆన్‌లైన్ మోడ్‌లో బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ పండుగల కారణంగా రాష్ట్రాల్లో వివిధ రోజులు సెలవులు కానున్నాయి. బ్యాంకులకు సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. బ్యాంకింగ్ సెలవులు కూడా వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలు లేదా ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పండుగలపై ఆధారపడి ఉంటాయి.

జనవరి 2022 బ్యాంక్ సెలవుల జాబితా
జనవరి 1 -   శనివారం (న్యూ ఇయర్ డే) 
జనవరి 2 -  ఆదివారం (వర్కింగ్ హాలిడే)
జనవరి 4 - మంగళవారం (లోసంగ్ - సిక్కిం)
జనవరి 8 -  శనివారం ( రెండవ శనివారం)
జనవరి 9 -  ఆదివారం (వర్కింగ్ హాలిడే) 
11 జనవరి -మంగళవారం (మిషనరీ డే - మిజోరం)
జనవరి 12 -   బుధవారం (స్వామి వివేకానంద జన్మదినం)
జనవరి 14 - శుక్రవారం (మకర సంక్రాంతి / పొంగల్)

15 జనవరి -   శనివారం (ఉత్తరాయణ పుణ్యకాల్ మకర సంక్రాంతి ఉత్సవ్ / మాఘే సంక్రాంతి / సంక్రాంతి / పొంగల్ / తిరువళ్లువర్ డే)
జనవరి 16 – ఆదివారం (వర్కింగ్ హాలిడే)
జనవరి 18 – మంగళవారం (థాయ్ పూసం-చెన్నై)
జనవరి 22 – శనివారం (నాల్గవ శనివారం)
జనవరి 23 – ఆదివారం (వర్కింగ్ హాలిడే)
జనవరి 26 – బుధవారం (గణతంత్ర దినోత్సవం)
జనవరి 30 – ఆదివారం (వర్కింగ్ హాలిడే)
జనవరి 31 - సోమవారం (మి-డామ్-మీ-ఫై, అస్సాం)

click me!