నిరుద్యోగులకు శుభవార్త! బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఎలా అప్లై చేయాలంటే..

Published : May 02, 2025, 04:42 PM IST

Bank of Baroda: బ్యాంకులో జాబ్ సంపాదించడం మీ లక్ష్యమా? అయితే ఇది మీకు కచ్చితంగా శుభవార్తే. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్ని పోస్టులు ఉన్నాయి? అర్హతలేంటి? ఎలా అప్లై చేయాలి? ఇలాంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం రండి.   

PREV
15
నిరుద్యోగులకు శుభవార్త! బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఎలా అప్లై చేయాలంటే..

బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) 2025 సంవత్సరానికి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా 500 ప్యూన్ ఖాళీలు ఉన్నాయి. మే 3, 2025 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ మే 23, 2025. ఈ రిక్రూట్మెంట్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

25

బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు 2025

సంస్థ పేరు: బ్యాంక్ ఆఫ్ బరోడా

పోస్ట్ పేరు: ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్)

ఉద్యోగ స్థానం: ఇండియా అంతటా

ఖాళీలు: 500

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్

అధికారిక వెబ్‌సైట్: bankofbaroda.in.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 3, 2025

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: మే 23, 2025

35

ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసే విధానం

విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు మే 3, 2025 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

స్టెప్ 1: బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్‌ bankofbaroda.inను సందర్శించండి.

స్టెప్ 2: "అప్లై" బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: స్క్రీన్ పై కొత్త రిజిస్ట్రేషన్ ఫారమ్ కనిపిస్తుంది. మీ పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేయండి.

స్టెప్ 4: "ప్రివ్యూ’’ చూసుకొని ‘‘క్రియేట్ యాన్ అకౌంట్" బటన్‌ను క్లిక్ చేయండి. 

45

అప్లికేషన్ ఫారమ్‌ ఫిల్ చేయడం:

స్టెప్ 1: మీ ఇమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.

స్టెప్ 2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన అన్ని వివరాలను సరిగ్గా పూరించండి.

స్టెప్ 3: ఫోటో, సంతకాన్ని సరైన ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయండి.

స్టెప్ 4: ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లోని సమాచారాన్ని సమీక్షించి, ఫీజు చెల్లించండి.

స్టెప్ 5: చివరగా పూర్తి చేసిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను భవిష్యత్తు అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసుకోండి.

55

ప్రభుత్వ ఉద్యోగం సాధించడం, అందులోనూ బ్యాంకు జాబ్ చేయాలని మీరు కోరుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆఫీస్ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఇటీవల పెద్దగా నోటిఫికేషన్స్ విడుదల అవడం లేదు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం మంచిది.  చివరి తేదీ వరకు వేచి ఉండకుండా త్వరగా దరఖాస్తు చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ప్రిపేర్ కావచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories