Fixed Deposit: ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తున్నారా...పలు బ్యాంకులు అందిస్తున్న FD రేట్లు ఇవే..

Published : Apr 25, 2022, 03:32 PM IST

ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం సురక్షితం మాత్రమే కాదు, హామీతో కూడిన రాబడిని కూడా అందిస్తుంది. ఇటీవలి కాలంలో, అనేక ప్రభుత్వ , ప్రైవేట్ రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను మార్చాయి. బ్యాంకులు ఇప్పుడు ఎఫ్‌డిపై మునుపటి కంటే ఎక్కువ వడ్డీని చెల్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు బ్యాంకుల అందిస్తున్న వడ్డీ రేట్లను తెలసుకుందాం.

PREV
16
Fixed Deposit: ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తున్నారా...పలు బ్యాంకులు అందిస్తున్న FD రేట్లు ఇవే..

మీరు కూడా ఎఫ్‌డి పొందాలని ప్లాన్ చేస్తుంటే, ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. ఇక్కడ మేము కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల FD రేట్ల గురించి మీకు సమాచారాన్ని అందిస్తున్నాము. పలు బ్యాంకుల ఫిక్స్ డ్ డిపాజిట్ల రేట్లను తెలుసుకోండి. 
 

26
SBI

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.9 శాతం నుండి 5.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఈ ప్రభుత్వ బ్యాంకు సీనియర్ సిటిజన్లకు అర శాతం అంటే 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ ఇస్తోంది. వీటికి కనీస వడ్డీ రేటు 3.4 శాతం. సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 6.3 శాతం వరకు వడ్డీ ఇస్తోంది.

36
HDFC Bank

ప్రైవేట్ రంగ HDFC బ్యాంక్ రూ. 2 కోట్ల వరకు వివిధ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.5 శాతం నుండి 5.6 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ కొత్త రేట్లు ఏప్రిల్ 6, 2022 నుండి అమలులోకి వచ్చాయి.

46
Bank Of Baroda

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) కూడా FDల వడ్డీ రేట్లను మార్చింది. బ్యాంక్ ఇప్పుడు 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధితో రూ. 2 కోట్ల వరకు డిపాజిట్లపై 2.8 శాతం నుండి 5.55 శాతం వడ్డీని అందిస్తోంది.

56
Kotak Mahindra Bank

ప్రైవేట్ రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రూ.2 కోట్ల వరకు వడ్డీని పెంచింది. ఈ బ్యాంక్ ఇప్పుడు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ ఉన్న FDలపై 2.5 శాతం నుండి 5.6 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. బ్యాంక్ కొత్త రేట్లు ఏప్రిల్ 12 నుంచి అమల్లోకి వచ్చాయి.

66
ICICI Bank

ప్రైవేట్ రంగ ICICI బ్యాంక్ 2 కోట్ల రూపాయల FDలపై కొత్త వడ్డీ రేటు 2.5 శాతం నుండి 5.6 శాతం వరకు ఉంటుంది. ఈ వడ్డీ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే FD పథకాలపై అందుబాటులో ఉంటుంది.

click me!

Recommended Stories