తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 119.49 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ రూ. 105.49గా ఉంది.
- విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 121.56కాగా, డీజిల్ రూ. 107.12గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగినందున ధరలు మరింత ఎగుస్తాయని అంచనాలున్నాయి. దీంతో దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగి, గ్రోత్‌పై ప్రభావం చూపనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం ఎక్కువగా పెట్రోల్, డీజిల్ అవసరాలపై ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు.