100 కి.మీ. వేగంతో 130 కి.మీ. దూసుకెళ్లే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది

First Published | Nov 22, 2024, 12:57 PM IST

ఎలక్ట్రిక్ స్కూటర్లంటే తక్కువ స్పీడ్ తో వెళతాయి కదా.. కాని ఇటీవలే ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టిన ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ లాంచ్ చేసిన మోడల్ ఏకంగా 100 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కి.మీ. వరకు ఆగకుండా పరుగులు తీస్తుంది. ఆ కంపెనీ రిలీజ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ తెలుసుకుందాం రండి. 

మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. టూ వీలర్ కంపెనీలు ఒకదాన్నిమించి ఒకటి భారీ డిస్కౌంట్ తో ఆఫర్లు అందిస్తూ పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఓలా, టీవీఎస్, బజాబ్ వంటి దిగ్గజ కంపెనీలు పండగల సందర్భంగా అనేక ఆఫర్లు ఇచ్చాయి. ఇప్పుడు ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి కొత్త కంపెనీ ప్రవేశించింది. ఈ కంపెనీ లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది. అద్భుతమైన డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆ కంపెనీ పేరు VLF టెన్నిస్. ఇది కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లోకి తీసుకు వచ్చింది. అద్భుతమైన డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతుండటంతో కస్టమర్ల అవసరాలు తీర్చడానికి వివిధ రకాల కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నారు.

VLF టెన్నిస్ కంపెనీ 1500 W ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ.1.29 లక్షలు. మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో ఈ కంపెనీ ప్లాంట్ ఉంది. దేశీయంగా తయారైన ఇటాలియన్ డిజైన్ టూ వీలర్ ఇది. KAW Veloce Motors Pvtకి చెందిన Velocifero (VLF) బ్రాండ్ కింద అందుబాటులో ఉంది.


ఇండియాలో VLF టెన్నిస్ స్కూటర్ సింగిల్ వేరియంట్‌లో లభిస్తోంది. 2.5 kWh బ్యాటరీతో ఈ స్కూటర్ వస్తోంది. దీని మోటార్ 157 Nm టార్క్‌ను అందిస్తుంది. స్కూటర్ 65 km/h వేగాన్ని అందుకుంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే 130 కి.మీ. రేంజ్ వరకు ఆగకుండా దూసుకుపోతుంది. అంతేకాకుండా కేవలం మూడు గంటలు ఛార్జింగ్ చేస్తే సరిపోతుంది. ఇది మాక్సిమం 100 కి.మీ. వేగాన్ని అందుకుని పరుగులు పెడుతుంది. 

88 కిలోల బరువు (బ్యాటరీతో సహా) ఉన్న ఈ స్కూటర్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. స్నోఫ్లేక్ వైట్, ఫైర్ ప్యూరీ డార్క్ రెడ్, స్లేట్ గ్రే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. అందువల్ల ఎంత వేగంగా దూసుకుపోతున్నా బ్రేక్ వేస్తే వెంటనే బండి ఆగుతుంది. ముందు టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్కులు, వెనుక హైడ్రాలిక్ మోనో-షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. అందువల్ల మీకు అసలు కుదుపులు, గుంతల సమస్య ఉండదు. ముఖ్యంగా ఒళ్లు, నడుము నొప్పులు రాకుండా ఉంటాయి. 

ఈ స్కూటర్ లో ఉన్న 5 అంగుళాల TFT స్క్రీన్ స్పీడోమీటర్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఛార్జింగ్ ఎంత ఉంది? ఎలక్ట్రికల్ సమస్యలను డిస్ ప్లే చేస్తూ ముఖ్యమైన సమాచారాన్ని కూడా తెలియజేస్తుంది. అంతేకాకుండా మూడు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది. ఈ వెర్షన్ 100 km/h వేగాన్ని అందుకుంటుంది. 2.8 kWh బ్యాటరీతో వచ్చే మరో VLF టెన్నిస్ స్కూటర్ కూడా 100 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్‌ చేయడానికి 5 నుంచి 6 గంటలు పడుతుంది.

Latest Videos

click me!