Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?

Published : Dec 21, 2025, 12:47 PM IST

Atal Pension yojana: ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ఉద్యోగం చేసే వారికి ప‌ద‌వి విర‌మ‌ణ త‌ర్వాత పెన్ష‌న్ వ‌స్తుంద‌ని తెలిసిందే. అయితే ప్రైవేటు రంగంలో, అందులోనూ అసంఘ‌టిత రంగంలో ప‌నిచేసే ప‌రిస్థితి ఏంటి.? అలాంటి వారి కోసమే ఈ పథకం. 

PREV
15
అటల్ పెన్షన్ యోజన అంటే ఏమిటి?

అటల్ పెన్షన్ యోజన (APY) కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సామాజిక భద్రతా పథకం. వృద్ధాప్యంలో నెలవారీ పెన్షన్ అందించడమే దీని లక్ష్యం. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, చిన్న ఉద్యోగాలు చేసే వారు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఈ పథకం ద్వారా లాభపడేలా ఇది రూపొందించారు. ఈ పథకం 2015–16 బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. గతంలో ఉన్న స్వావలంబన్ యోజన స్థానంలో దీనిని తీసుకొచ్చారు.

25
ఎవరు అర్హులు?

ఈ పథకానికి అర్హత పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి.

* భారత పౌరుడై ఉండాలి

* వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి

* కనీసం 20 సంవత్సరాలు చందా చెల్లించాలి

* ఆధార్‌కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ఉండాలి

* మొబైల్ నంబర్ ఉండాలి

* 60 ఏళ్లు పూర్తయిన తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు స్థిర పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. పెన్షన్ మొత్తం వయసు, మీరు చెల్లించే నెల‌వారీ చందా మొత్తంపై ఆధారపడి ఉంటుంది.

35
చందా విధానం, పెన్షన్ ఎలా వస్తుంది?

APYలో చేరిన వ్యక్తి నెలనెలా లేదా త్రైమాసికంగా చందా చెల్లించాలి. ఈ మొత్తం ఆటో డెబిట్ ద్వారా బ్యాంక్ ఖాతా నుంచి కట్ అవుతుంది. పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే జీవిత భాగస్వామికి అదే పెన్షన్ కొనసాగుతుంది. ఇద్దరూ మరణిస్తే మొత్తం కార్పస్ నామినీకి అందుతుంది. 60 ఏళ్లకు ముందే మరణిస్తే భాగస్వామి పెన్షన్ కొనసాగించుకోవచ్చు లేదా పథకం నుంచి బయటకు వచ్చి మొత్తం పొందవచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు 28 ఏళ్ల వ‌య‌సున్న వ్య‌క్తికి నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్ రావాలంటే నెల‌కు సుమారు రూ. 500 చెల్లిస్తే స‌రిపోతుంది.

45
అటల్ పెన్షన్ యోజనకు ఎలా దరఖాస్తు చేయాలి?

ఈ పథకానికి రెండు మార్గాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ విధానం:

కొన్ని బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా APY సదుపాయం ఇస్తున్నాయి. లాగిన్ అయి APY ఎంపికను ఎంచుకుని నమోదు చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్ విధానం:

బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి APY ఫారమ్ తీసుకోవాలి. అవసరమైన వివరాలు నింపి ఆధార్ కాపీ జత చేసి సమర్పించాలి. నమోదు పూర్తయిన తర్వాత మొబైల్‌కు వెరిఫికేష‌న్ మెసేజ్ వ‌స్తుంది.

55
పన్ను మినహాయింపులు, డిఫాల్ట్ జరిమానాలు

APYలో పెట్టిన మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం సెక్షన్ 80CCD(1) కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. అదనంగా సెక్షన్ 80CCD(1B) కింద మరో రూ.50,000 మినహాయింపు ఉంటుంది. చందా చెల్లించడంలో ఆలస్యం అయితే జరిమానా విధిస్తారు. నెలవారీ చందా మొత్తాన్ని బట్టి రూ.1 నుంచి రూ.10 వరకు పెనాల్టీ వసూలు చేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories