ఇన్‌స్టాగ్రామ్‌లో ఆశ్చర్యపర్చిన రతన్ టాటా.. 83 ఏళ్లలో ఇలాంటి స్కిల్స్ అతనిలో ఎప్పుడు చూసి ఉండరు..

First Published Sep 8, 2021, 5:51 PM IST

టాటా గ్రూప్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా పియానోపై  తనకు ఇప్పటివరకు ఇష్టాన్ని చూపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. 83 ఏళ్ల రతన్ టాటా మ్యూజిక్ డివైజ్ పియనోతో తనకు ఉన్న ప్రయాణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 

తాను చిన్నతనంలోనే పియానో ​​వాయించడం కొంచెం నేర్చుకున్నానని, రిటైర్ అయిన తర్వాత  పియానో ​​వాయించడం మళ్లీ హాబీగా చేసుకున్నానని, కానీ ఇందుకు అవసరమైన కన్సెంట్రేషన్  కేటాయించలేకపోతున్నట్లు  వెల్లడించాడు. అలాగే రతన్ టాటా పియానోపై  భవిష్యత్తులో మరోసారి తన చేతిని ప్రయత్నించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

"నేను చిన్నపిల్లడిగా ఉన్నపుడు పియానోని కొద్దిగా నేర్చుకున్నాను" అని గుర్తుచేసుకుంటు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ లైన్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత క్షణాని వివరిస్తూ "ఇంకా బాగా పియనో నేర్చుకోవాలనే ఆలోచనతో నేను ఆకర్షితుడనయ్యాను. నా పదవీ విరమణ తర్వాత నేను ఒక గొప్ప పియానో ​​టీచర్‌ను కనుగొన్నాను కానీ రెండు చేతులతో పియనో ప్లే చేయడానికి అవసరమైన కన్సెంట్రేషన్  ఇవ్వలేకపోయాను. కానీ భవిష్యత్తులో మరోసారి ప్రయత్నించాలని ఆశిస్తున్నాను. " అని అన్నారు. రతన్ టాటా అత్యంత శ్రద్ధతో పియానోపై చేతులు పెట్టి పియనో ప్లే చేయడానికి  ప్రయత్నిస్తున్నట్లు  ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో మీకు కనిపిస్తుంది.

రతన్ టాటా చేసిన ఈ పోస్ట్‌ను 24 గంటలలోపు 9 లక్షల మంది ఫాలోవర్స్  లైక్ చేశారు. ఇంకా 9 వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. రతన్ టాటా తనలోని ప్రతిభను పెంపొందించుకోవడం చూసి అతని ఫాలోవర్స్ ఎంతో సంతోషించారు. ఒక ఫాలోవర్  అయితే "మీరు ఒక ఇన్స్పిరేషన్ సార్."  అని కామెంట్ చేయగా మరికొందరు రతన్ టాటా"లెజెండ్" అని కామెంట్ పోస్ట్ చేశారు.

రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ కి రెడ్ హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీలు కామెంట్ విభాగాన్ని ముంచెత్తాయి. రతన్ టాటా తన జీవితమంతా నేర్చుకోవాలనే కోరికపై ఒక యూజర్ స్పందిస్తూ అతను ఎల్లప్పుడూ నేర్చుకునేవాడు అని అన్నారు. ఈ వ్యక్తి  టాటా ప్రతిభను చూసి ఆశ్చర్యపోయి  "మీరు చేయలేనిది ఏదైనా ఉందా సార్?" అనగా  మరొకరు "మీకు అసాధ్యం అంటూ ఏమీ లేదు సార్." అని అన్నారు.

అతని మ్యూజిక్ నైపుణ్యాలపై కొందరు ఇంట్రెస్ట్ చూపగా ఒక వ్యక్తి  మాత్రం "సర్, మీరు రెండు చేతులతో పియానో ​​వాయించే వీడియో కోసం నేను ఎదురుచూస్తాను."  అని కామెంట్ చేశారు. మరొకరు రతన్  టాటా ప్రతిభపై తన విశ్వాసాన్ని నిలుపుకున్నారు, లెజెండరీ మాస్ట్రో లుడ్విగ్ వాన్ బీతొవెన్‌తో పోల్చారు. 

click me!