దుబాయిలో బంగారు నగల షాపింగ్ చేస్తున్నారా, అయితే భారత్ కు ఎంత బంగారం తెచ్చుకోవచ్చు..పూర్తి వివరాలు మీకోసం..

Published : Oct 11, 2022, 08:01 PM IST

దుబాయ్ లో షాపింగ్ అంటే గుర్తొచ్చేది బంగారమే. మన భారతీయులు అత్యధికంగా దుబాయ్ లో బంగారం షాపింగ్ పేరుంది. అందుకు కారణం లేకపోలేదు. దుబాయిలో బంగారం ధర భారత్ తో  పోలిస్తే తక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇక  దుబాయ్ నుంచి బారత్ కు ఎంత బంగారం తెచ్చుకోవచ్చో  తెలుసుకుందాం..   

PREV
17
దుబాయిలో బంగారు నగల షాపింగ్ చేస్తున్నారా, అయితే  భారత్ కు ఎంత బంగారం తెచ్చుకోవచ్చు..పూర్తి వివరాలు మీకోసం..

బంగారానికి, భారతీయులకు అవినాభావ సంబంధం ఉంది. బంగారం కేవలం ఆభరణాలకే పరిమితం కాదు. శుభప్రదమని నమ్ముతారు. ఈ కారణంగా, వివాహం, నామకరణం, పూజలు వంటి అన్ని సందర్భాలలో బంగారం కొనుగోలు చేస్తారు. స్త్రీలకు కూడా బంగారం లేకపోతే అలంకరణ అసంపూర్ణంగా భావిస్తారు.  అంతేకాదు బంగారం కష్టకాలంలో కాపాడుతుందని చాలా మంది నమ్ముతారు. 
 

27

అందుకే బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే చాలా మంది ఉంటారు. ఇటీవలి కాలంలో బంగారం ధరలో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరోసారి పెంచడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే, తగ్గుతున్న బంగారం ధరలు భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లను ఉత్సాహపరిచాయి. పెట్టుబడిదారులకు తక్కువ ధరలకు బంగారం కొనుగోలు చేసే అవకాశం లభించింది. అలాగే, చాలా మంది పెట్టుబడిదారులు దుబాయ్ నుండి బంగారాన్ని దిగుమతి చేసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే దుబాయ్ లో బంగారం ధర భారతదేశంలో కంటే తక్కువగా ఉంది. 
 

37

దుబాయ్ బంగారు నగరంగా ప్రసిద్ధి చెందింది. బంగారం ధర తక్కువగా ఉండటం, నాణ్యత బాగుండడమే ఇందుకు కారణం. దుబాయ్  పన్ను రహిత దేశం. ఇక్కడ బంగారం కొనుగోలు చేస్తే వ్యాట్ లేదా అమ్మకపు పన్ను లాంటివి ఉండవు. దుబాయ్ నుండి భారతదేశానికి టాక్స్ లేకుండా ఎంత బంగారాన్ని తీసుకురావచ్చు? అనే ప్రశ్న మనల్ని వేధించడం సహజం.
 

47

చాలా మంది భారతీయులు దుబాయ్, సౌదీ అరేబియాలో నివసిస్తారు. పన్ను చెల్లించకుండా భారత్‌కు ఎంత బంగారాన్ని తీసుకురావచ్చు అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది. పన్ను లేకుండా దుబాయ్ నుండి భారతదేశానికి దిగుమతి అయ్యే బంగారం మొత్తం పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఉంది. 
 

57

నిబంధనల ప్రకారం దుబాయ్ నుంచి మనిషి గరిష్టంగా 20 గ్రాముల బంగారాన్ని దిగుమతి చేసుకోవచ్చు. అలాగే, ఒక మహిళ గరిష్టంగా 40 గ్రాముల బంగారాన్ని దుబాయ్ నుంచి భారత్‌కు డ్యూటీ ఫ్రీగా అంటే కస్టమ్ డ్యూటీ కట్టకుండా బంగారం తీసుకురావచ్చు. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు భారతదేశం బయట జీవించే వారు. స్వదేశానికి తిరిగి వచ్చే సమయంలో  దుబాయ్ నుండి భారతదేశానికి తమతో పాటు మరింత ఎక్కువ బంగారాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంది. పిల్లల పేరిట సైతం బంగారం తెచ్చుకునే వీలుంది.  
 

67

ఈ పన్ను మినహాయింపు బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది.బంగారం బిస్కట్, నాణెం సహా ఇతర రూపాల్లో ఉన్న బంగారానికి బోర్డర్ డ్యూటీ వర్తిస్తుంది. దుబాయ్ నుంచి భారత్‌కు వెళ్లే ప్రయాణికులు పైన పేర్కొన్న పరిమితి కంటే ఎక్కువ బంగారాన్ని భారత్‌లోకి తీసుకువస్తే పన్ను చెల్లించాలి. 
 

77

గరిష్టంగా ఎంత బంగారం తీసుకురావచ్చు?
పన్ను చెల్లించి దుబాయ్ నుండి భారతదేశానికి ఎంత బంగారాన్ని తెచ్చుకోవచ్చు తెలుసుకుందాం ఆరు నెలలకు పైగా దుబాయ్‌లో లేదా విదేశాల్లో నివసించే వ్యక్తులు గరిష్టంగా ఒక కిలో బరువున్న బంగారు నాణేలు,  బిస్కెట్ భారతదేశంలోకి తీసుకురావచ్చు. ఇందుకోసం వారు నిర్ణయించిన బోర్డర్ డ్యూటీ సుంకాన్ని చెల్లించాలి.

Read more Photos on
click me!

Recommended Stories