టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన ఫ్లాగ్‌షిప్ లైఫ్‌స్టైల్ యుటిలిటీ వాహనం, Hilux కోసం బుకింగ్‌లను తిరిగి ప్రారంభించింది. 2022 ప్రారంభంలో ప్రారంభించినప్పటి నుండి, Hilux స్టైలింగ్, డ్రైవింగ్ సౌకర్యం కారు ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. అధిక డిమాండ్, సరఫరాను ప్రభావితం చేసే వివిధ కారకాల కారణంగా Hilux బుకింగ్‌లు ముందుగా నిలిపివేశారు. అయితే ఇప్పుడు డీలర్ అవుట్‌లెట్లలో, ఆన్‌లైన్‌లో వాహనం, బుకింగ్ ప్రారంభమైంది.