Home Loan ద్వారా ఇల్లు కొంటున్నారా, అయితే హోమ్ లోన్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు..

First Published Jan 10, 2023, 2:35 PM IST

కొత్త ఇల్లు కొంటున్నారా అయితే వెంటనే, హోమ్ లోన్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? దాని ఫీచర్లు, పన్ను ప్రయోజనాలను తెలుసుకోవడం చాలా ముఖ్యమైన పని..

సొంత ఇల్లు కొనడం లేదా నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి కల. హోం లోను తీసుకోవడం కూడా దీర్ఘకాలిక ఆర్థిక బాధ్యత అనే మాట వాస్తవం. చెల్లింపు దీర్ఘకాలికంగా ఉన్నప్పటికీ, ఇది అనేక సవాళ్లతో పాటు ప్రయోజనాలతో కూడి ఉంటుంది. నెలవారీ చెల్లింపులు జరగకపోవడమే కాకుండా, అప్పు తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ అప్పు కుటుంబానికి భారంగా మారుతుందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. 

అందుకే, దీర్ఘకాలిక హోం లోనుతో పాటు, నేడు అనేక బ్యాంకులు వినియోగదారులకు హోం లోను  బీమాను అందిస్తున్నాయి. దీని ద్వారా రుణగ్రహీత ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులపై భారం పడకుండా రుణం పొందే వీలుంది. అయితే, ఆర్‌బీఐ హోం లోనుతో పాటు బీమా రక్షణను తీసుకోవడాన్ని తప్పనిసరి చేయలేదు. మనం ఈ బీమా తీసుకోవాలి అనుకుంటే మాత్రమే చేయగలం. అయితే, ఇప్పుడు ఆర్థిక సంస్థలు , బ్యాంకులు బీమా రక్షణను తీసుకోవాలని వినియోగదారులను సిఫార్సు చేస్తున్నాయి.

హోం లోను  బీమా
హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ లేదా హోమ్ లోన్ ఇన్సూరెన్స్ అనేది హోమ్ లోన్ రుణగ్రహీత ఊహించని వైకల్యం లేదా మరణం సంభవించినప్పుడు బకాయి ఉన్న లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో సహాయపడే ప్లాన్. ఇది రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థలకు , రుణగ్రహీతలకు రక్షణను అందిస్తుంది. మరోవైపు, హోం లోను  బీమా ద్వారా అందించబడిన రక్షణ రుణ మొత్తాన్ని చెల్లించిన తర్వాత ముగుస్తుంది.
 

ఎలా కొనాలి?
హోమ్ లోన్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పటికే ఉన్న లేదా కొత్త గృహ రుణ గ్రహీతల కోసం. రుణదాతలు సాధారణంగా గృహ రుణ బీమాను వన్-టైమ్ ప్రీమియం ప్లాన్‌గా అందిస్తారు. ఇది సాధారణంగా గృహ రుణ మొత్తానికి జోడించబడుతుంది.
 

లాభాలు
కుటుంబాన్ని రక్షిస్తుంది: రుణగ్రహీత ఊహించని మరణం కారణంగా ఆర్థిక భారం నుండి కుటుంబాన్ని రక్షిస్తుంది. రుణగ్రహీత, ఇల్లు , విలువైన వస్తువులు రక్షించబడతాయి. రుణగ్రహీత లేనప్పుడు ఏర్పడిన బకాయిలను తిరిగి పొందడానికి రుణ ఆర్థిక సంస్థలు విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునే పరిస్థితిని ఇది నివారిస్తుంది.

పన్ను: హోమ్ లోన్ ఇన్సూరెన్స్ , వన్-టైమ్ ప్రీమియం చెల్లింపు హోమ్ లోన్ మొత్తానికి జోడించబడినందున, ఆదాయపు పన్ను చట్టంలోని రూల్ 80-C కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది.
 

click me!