ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ పేరుతో అతి పలుచటి ఫోన్ తయారు చేస్తోందని, ఇది ప్లస్ మోడల్‌ను రీ ప్లేస్ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ మందం కేవలం 5.5 మి.మీ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్‌లలో ఇదే అతి పలుచటి ఫోన్ అవుతుంది. ఇందులో eSIM మాత్రమే ఉంటుంది. ప్రత్యేకమైన కెమెరా సెటప్ కూడా ఉంటుందని సమాచారం. ఈ పలుచని కొత్త మోడల్ 2025 జూన్ నెల తర్వాత విడుదల కానుందని తెలుస్తోంది.
ఐఫోన్ 17 ఎయిర్ ను ఐఫోన్ స్లిమ్ అని కూడా పిలుస్తారు. టిఎఫ్ సెక్యూరిటీస్ ఇంటర్నేషనల్ విశ్లేషకుడు మింగ్-చి కువో ఇచ్చిన సమాచారం ప్రకారం ఇది చాలా పలుచగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత ప్లస్ మోడల్‌ను ఐఫోన్ 17 సిరీస్‌లో ఇది భర్తీ చేస్తుందని, ఆపిల్ ఇప్పటివరకు తయారు చేసిన వాటిలో ఇదే అతి పలుచటి ఐఫోన్ కావచ్చని భావిస్తున్నారు.
దీని మందం 5.5 మి.మీ. చిన్న డిజైన్ eSIMను మాత్రమే ఇందులో ఉపయోగించడానికి వీలుంటుంది. సాంప్రదాయ SIM కార్డ్ పోర్ట్ ఉండదు. అయితే SIM కార్డ్ లేకపోవడం వల్ల షిప్పింగ్ కష్టం అవుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
ఐఫోన్ 17 ఎయిర్ నిజంగా 5.5 మి.మీ మందమే ఉంటే 2014లో వచ్చిన 6.9 మి.మీ ఐఫోన్ 6 కంటే ఇది చాలా చిన్నది అవుతుంది. ఐఫోన్ 17 ఎయిర్ 6.25 మి.మీ మందంగా ఉంటుందని మునుపటి వార్తలు చెబుతున్నాయి. ప్రస్తుత ఐఫోన్ 16 మందం 7.8 మి.మీ. శామ్‌సంగ్ గెలాక్సీ S25 స్లిమ్ 6 మి.మీ మందంగా ఉంటుందని భావిస్తున్నారు.
అదనంగా కొత్త ఐఫోన్ 17 ఎయిర్ ధర $1,299 నుంచి $1,500 మధ్య ఉంటుందని అంచనా. అయితే ప్రస్తుతం మార్కెట్లో ప్రో వేరియంట్లు తక్కువ ధరకు లభిస్తున్నందున దీన్ని అమ్మడం కష్టం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే ఈ ఏడాది సగం నెలలు పూర్తయిన తర్వాత మార్కెట్ లోకి విడుదల చేయాలని కంపెనీ అనుకుంటోందట. ఇందులో 8GB RAM, ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు అనుకూలమైన A18 లేదా A19 CPU ఉంటుందని సమాచారం.
ఈ కొత్త పలుచటి స్మార్ట్‌ఫోన్‌లో మొదటి ఆపిల్ 5G, Wi-Fi ప్రాసెసర్‌లు ఉండవచ్చు. ఐఫోన్ 17 ఎయిర్‌లో 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల OLED ప్రోమోషన్ డిస్‌ప్లే ఉంటుందని భావిస్తున్నారు. పలుచటి డిజైన్ వల్ల వచ్చే ఏకైక మార్పు ఏమిటంటే ఆపిల్ ఒకే 48MP వెనుక కెమెరా, ముందు 24MP సెల్ఫీ కెమెరాను అందించే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి ల్యాప్‌టాప్ కొనాలంటే ఇదే మంచి టైం: అమెజాన్ బంపర్ ఆఫర్