అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ల్యాప్‌టాప్ లపై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. 2025 అమెజాన్ గణతంత్ర దినోత్సవ స్పెషల్ సేల్‌లో రూ.60,000 బడ్జెట్ లోనే మీరు సూపర్ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయవచ్చు. జనవరి 13 నుండి ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో భాగంగా HP, Dell, ASUS, Lenovo బ్రాండ్‌ల ల్యాప్‌టాప్‌లు 30% తగ్గింపుతో లభ్యమవుతున్నాయి.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్‌లతో సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. మీరు మంచి బడ్జెట్ ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే ఇక్కడ మంచి కంపెనీలకు చెందిన ల్యాప్ టాప్ లు చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. రూ.60,000 కంటే తక్కువ ధర కలిగిన టాప్ 5 ల్యాప్‌టాప్‌ల గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ASUS Vivobook 16
ఈ ల్యాప్‌టాప్‌లోని 512GB SSD వేరియంట్ ఇంతకు ముందు వరకు రూ.85,990కి అమ్ముడయ్యేది. ఇప్పుడు అమెజాన్‌లో 29% తగ్గింపుతో లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లు మీకు పొందగలిగితే ఈ ల్యాప్ టాప్ ని మీరు రూ.60000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
Lenovo IdeaPad Slim 3
మంచి బ్రాండ్ విలువ కలిగిన లెనొవొ కంపెనీ అందిస్తున్న ఐడియాపాడ్ స్లిమ్ 3 అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ అమెజాన్ గణతంత్ర దినోత్సవ సేల్‌లో 30% తగ్గింపుతో లభిస్తుంది. అంటే దీన్ని మీరు కేవలం రూ.59,990కే సొంతం చేసుకోవచ్చు.
Dell Inspiron 14
హార్ వేర్ కంపెనీల్లో ప్రపంచంలోనే టాప్ కంపెనీ అయిన డెల్ అందిస్తున్న ఇన్స్‌పిరాన్ 14 అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. ఇది 13వ తరం ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ కలిగిన వర్క్‌స్టేషన్ ల్యాప్‌టాప్. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఈ ల్యాప్‌టాప్‌పై 22 % తగ్గింపు లభిస్తుంది.
HP 15
హెచ్‌పీ కంపెనీ వినియోగదారుల కోసం రెండు అద్భుతమైన ల్యాప్ టాప్ లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. పనితీరులో బెస్ట్ పర్ఫామెన్స్ కలిగిన HP 15 ల్యాప్‌టాప్ పై 25 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని ధర మార్కెట్ లో రూ.71,773 ఉంది. అయితే ప్రస్తుత అమెజాన్ సేల్‌లో 25% తగ్గింపుతో కేవలం రూ.53,990కే కొనుగోలు చేయవచ్చు.
HP Pavilion Laptop 14
చివరగా అమెజాన్ గణతంత్ర దినోత్సవ సేల్‌లో కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకునేవారు HP పెవిలియన్ 14ని ఒకసారి చూడండి. దీనిపై 27 % తగ్గింపు లభిస్తుంది.