petrol diesel price today:ఇంధన ధరలలో తగ్గింపు.. ఈ కారణంగా చమురు కంపెనీల నిర్ణయం..

First Published Nov 22, 2021, 12:30 PM IST

యూరప్‌లో కోవిడ్-19(covid-19) కేసులు మళ్ళీ పెరుగుదల కారణంగా రానున్న కాలంలో ఇంధన ధరలు (fuel prices)తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. డిమాండ్ ఆందోళనలతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల దేశీయ ఇంధన రిటైలర్లు పెట్రోల్(petrol), డీజిల్(diesel) ధరలను తగ్గించడానికి ప్రేరేపించవచ్చు. ఈ సమాచారం ఒక నివేదికలోని సోర్సెస్ ఉటంకిస్తూ భాగస్వామ్యం చేయబడింది.

బ్రెంట్ క్రూడ్: 
బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ శుక్రవారం ఒక నెల గరిష్ట స్థాయికి చేరిన తర్వాత బ్యారెల్‌కు 6.95 శాతం పడిపోయి 80 డాలర్ల నుండి 78.89 డాలర్లకు చేరింది. బ్రెంట్ క్రూడ్ ధర అక్టోబరు 1 తర్వాత ఇదే కనిష్ఠం. సుమారు 10 రోజుల క్రితం దీని ధర బ్యారెల్‌కు  84.78డాలర్లకి చేరుకుంది. 

ఎక్సైజ్ సుంకం ప్రభావం 
 భారతదేశంలో అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ల రోజువారీ కదలికతో నేరుగా ముడిపడి ఉన్న పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు నవంబర్ 4 నుండి స్థిరంగా ఉన్నాయి.  అయితే దీపావళికి ఒక రోజు ముందు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని వరుసగా లీటరుకు రూ. 5 అలాగే రూ. 10 తగ్గించింది. 

ఢిల్లీలో 18 రోజులుగా
గత 18 రోజులుగా ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.103.97 వద్ద, డీజిల్ లీటరుకు రూ.86.67 వద్ద స్థిరంగా ఉంది . నివేదిక ప్రకారం, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 80 డాలర్ల కంటే దిగువకు పడిపోయిందని అంటే అక్టోబర్ 1 నుండి కనిష్ట స్థాయికి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గడం ఇదే కారణమని వర్గాలు తెలిపాయి. 

భారతదేశం మూడవ అతిపెద్ద చమురు వినియోగదారి
డిమాండ్ కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు చాలా నెలల తర్వాత మొదటిసారిగా పడిపోయాయని, లేకపోతే చమురు ఉత్పత్తిదారులు యూ‌ఎస్, భారతదేశం వంటి ప్రధాన వినియోగదారుల నుండి వచ్చిన అభ్యర్థనలను పట్టించుకోకుండా చమురు ధరలను పెంచేవి ఒక నివేదిక తెలిపింది. గమనార్హమైన విషయం ఏమిటంటే, అమెరికా, చైనాల తర్వాత ముడి చమురు వినియోగంలో భారతదేశం మూడవ అతిపెద్దది.

22 నవంబర్ 2021 సోమవారం అంటే నేడు వరుసగా 18వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం  ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత కీలక నగరాల్లో ఇంధన ధరలు చివరిగా నవంబర్ 4న సవరించబడ్డాయి.  

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.97గా ఉండగా, డీజిల్ ధర రూ.86.67గా ఉంది. ముంబైలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.109.98 కాగా, డీజిల్ ధర రూ.94.14గా ఉందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌ వెల్లడించింది.

భారతదేశంలో, స్థానిక పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలను బట్టి ఇంధన ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆటోమొబైల్ ఇంధనాలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు సోమవారం ఏడు వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. బ్రెంట్ 05:02 GMT నాటికి బ్యారెల్‌కు 14 సెంట్లు (0.2 శాతం) నష్టపోయి 78.75 డాలర్లకి చేరుకుంది. యూ‌ఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 4 సెంట్లు తగ్గి 75.90 డాలర్ల వద్ద ఉన్నాయని ఒక నివేదిక పేర్కొంది.


22 నవంబర్ 2021  నాడు మీ నగరంలో ఒక లీటర్ పెట్రోల్, డీజిల్‌ ధర 
నగరం    పెట్రోల్ (రూ./లీటర్)    డీజిల్ (రూ./లీటర్)
న్యూఢిల్లీ    103.97                       86.67
ముంబై      109.98                        94.14
కోల్‌కతా     104.67                        89.79
చెన్నై         101.40                      91.43
బెంగళూరు 100.58                      85.01
హైదరాబాద్ 108.20                    94.62
పాట్నా        105.90                      91.09
భోపాల్        107.23                     90.87
జైపూర్         107.06                     90.70
లక్నో    95.28              86.80

click me!