ముంబైలోని అమితాబ్ బచ్చన్ లగ్జరీ ఫ్లాట్.. ఈ ఇంట్లో బాత్రూమ్ ఫిటింగ్స్ కోసం ఫ్రాన్స్, జర్మనీ నుండి ఆర్డర్..

First Published | May 29, 2021, 1:56 PM IST

బాలీవుడ్ బ్లాక్ బుస్టర్  హీరో అమితాబ్ బచ్చన్‌ను గత శతాబ్దపు గొప్ప హీరో అంటారు. అతను ఇప్పటికీ కూడా సినిమాల్లో నటిస్తున్నరు. త్వరలో ఆయన కౌన్ బనేగా కరోర్ పతి షోలో కనిపించనున్నారు. 

ఇదిలావుండగా అమితాబ్ బచ్చన్ ముంబైలో రూ .31 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్ ని కొనుగోలు చేశారు. ఈ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ 5184 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 27, 28 అంతస్తులలో ఉన్న ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌లో బిగ్ బికి 6 కార్ల పార్కింగ్ స్థలం ఉంది.
అమితాబ్ బచ్చన్ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ ధరబిగ్ బి ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను 2020 డిసెంబర్‌లో కొనుగోలు చేశారు అయితే ఏప్రిల్ 2021లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అమితాబ్ బచ్చన్ కు మరో ఐదు ఇళ్ళు కూడా ఉన్నాయి, ఇవి కూడా చాలా విలాసవంతమైనవి. అమితాబ్ ముంబై నివాసి కాదు, కానీ సినీ ప్రపంచానికి వచ్చిన తరువాత అతను ముంబైని తన నివాసంగా చేసుకున్నాడు.

అమితాబ్ బచ్చన్ కి ముంబైలో మొత్తం ఐదు బంగ్లాలు ఉన్నాయి. ప్రస్తుతం అమితాబ్ తన కుటుంబమంతా కలిసి జల్సా ఇంటిలో నివసిస్తున్నారు. ప్రతి ఆదివారం వీరిని కలవడానికి అభిమానులు కూడా ఇక్కడకు వస్తుంటారు. ఈ ఇళ్ళు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అమితాబ్ ఇల్లు జల్సా ముఖ్యంగా ప్రజలలో ఆకర్షణ కేంద్రంగా ఉంది.
అమితాబ్ బచ్చన్ జల్సా బంగ్లా ముంబైలోని జుహు ప్రాంతంలో ఉంది. అతని భార్య జయ బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, మనవరాలు ఆరాధ్యతో కలిసి జల్సాలో నివసిస్తున్నారు.
రెండవ బంగ్లా పేరు‘ప్రతీక్ష’, వారు ‘జల్సా’ ఇంటిలోకి మారే ముందు ఇక్కడే నివసించారు. అమితాబ్ తన తల్లిదండ్రులతో కలిసి కొన్నాళ్లు ఇక్కడే ఉన్నాడు. అభిషేక్, శ్వేతా కూడా తమ బాల్యాన్ని ఇక్కడే గడిపారు.అమితాబ్ బచ్చన్ తరచూ తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అతని మూడవ బంగ్లా పేరు 'జనక్', అక్కడ అతనికి కార్యాలయం కూడా ఉంది. నాల్గవ బంగ్లా వాట్సా. వారు దీనిని బ్యాంకుకు లీజుకు ఇచ్చారు. ఇవి కాకుండా కొన్ని నివేదికల ప్రకారం, 2013లో కూడా అతను 'జల్సా' వెనుక దాదాపు రూ.60 కోట్ల విలువైన బంగ్లాను కొనుగోలు చేశాడు.
అమితాబ్ బచ్చన్ ఇంటి ఫ్లోరింగ్ కోసం ఇటాలియన్ పాలరాయి ఉపయోగించారు. ఇంకా బాత్రూమ్ ఫిటింగ్స్ కోసం ఫ్రాన్స్, జర్మనీ నుండి వీటిని ప్రత్యేకంగా ఆర్డర్ చేశారు. ఈ ఫోటోలో ఆ ఇంటి గొప్పతనాన్ని చూడవచ్చు. బిగ్ బి లగ్జరీ వాహనాలను కూడా చాలా ఇష్టపడతారు.
ఈ విధంగా బిగ్ బి కి 'జల్సా' లభీంచిందిజల్సా ఇళ్ళు ఫిల్మ్ డైరెక్టర్ ఎన్‌సి సిప్పీకి చెందినది. 'ఆనంద్', 'నమక్ హరామ్', 'చుప్కే చుప్కే', 'సట్టే పె సత్తా' చిత్రాలను ఇక్కడే చిత్రీకరించారు. ఎన్‌సి సిప్పి 'సట్టే పె సత్తా' నిర్మాత. ఆయన కుమారుడు రాజ్ ఎన్ సిప్పీ దర్శకత్వం వహించిన 'సట్టే పె సత్తా'లో అమితాబ్ బచ్చన్ నటించినందుకు బదులుగా, అతను ఈ బంగ్లాను పొందాడు. రాజ్ ఎన్ సిప్పీ ఇంతకు ముందు జోష్, ఇంకర్ అనే రెండు సినిమాలు కూడా చేశారు. ఇవి అంతాగా ఆడలేకపోయాయి.
ఇది జల్సా ఇంటి బయట ఉన్న చిత్రం. ఆదివారం ఇక్కడికి భారీ సంఖ్యలో బిగ్ బి అభిమానులు వస్తారు. అయితే కరోనా కారణంగా అమితాబ్ బచ్చన్ అతని అభిమానులను కలవట్లేదు.

Latest Videos

click me!