Gold Price 2026: బంగారం ధరలు వచ్చే ఏడాది తగ్గుతాయని ఎంతో మంది వేచి ఉన్నారు. కానీ ఒక టాప్ అమెరికన్ బ్యాంకు మాత్రం బంగారం పదిగ్రాముల ధర మరింత పెరిగిపోతుందని అంచనా వేసి చెబుతోంది.
బంగారానికి డిమాండ్ పెరిగిపోతోంది. దానికి తగ్గట్టే ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అయితే వచ్చే ఏడాది మాత్రం ధరలు తగ్గుతాయని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ అమెరికాకు చెందిన పెద్ద బ్యాంకు మాత్రం వచ్చే ఏడాది బ్యాంకు ధరలు మరింతగా పెరుగుతాయని అంచనా వేసి చెప్పింది. ఆ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఇది చెబుతున్న ప్రకారం 2026 నాటికి బంగారం ప్రపంచ మార్కెట్‌లో చాలా ఎక్కువ డిమాండ్ వస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక ఒత్తిడి ఉన్నాయి. ద్రవ్యోల్బణం తగ్గడం లేదు, వడ్డీ రేట్లు స్థిరంగా లేకపోవడం పెట్టుబడిదారుల్లో మరింత భయాన్ని పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో, చాలా మంది సేఫ్ పెట్టుబడి కోసం బంగారాన్ని ఎన్నుకుంటున్నారు. అలాగే సెంట్రల్ బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ఇవన్నీ కలిపి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో బంగారం ధర పెరగడానికి కారనం అవుతున్నాయి.
23
ఎంత పెరుగుతుంది?
ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధర సాధారణంగా ఔన్స్‌లో కొలుస్తారు. కానీ మనం భారత్‌లో మాత్రం గ్రాములలో కొనుగోలు చేస్తాం. ఒక ఔన్స్ అంటే సుమారు 28.35 గ్రాములు. బంగారం ప్రపంచ మార్కెట్‌లో పెద్ద ఎత్తున పెరిగితే ఒక్క గ్రాము ధర రూ.14,000 నుంచి రూ.15,000 వరకు చేరే అవకాశం ఉంది. దీని ఆధారంగా 10 గ్రాముల ధర దాదాపు రూ.1,40,000 నుండి రూ.1,57,000 మధ్య ఉండవచ్చు. అయితే ఇది ఖచ్చితమైన ధర కాదు. ఒక అంచనా మాత్రమే. వాస్తవ ధర మన దేశంలోని డిమాండ్, రూపాయి విలువ, పన్నులు, మార్కెట్ పరిస్థితులు ఆధారంగా మారిపోతుంది.
33
బంగారం కొనడం కష్టమేనా?
భారతదేశంలో బంగారం ధర ఎప్పుడూ ప్రపంచ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రూపాయి విలువ కొద్దిగా బలహీనంగా ఉంది. అంతేకాక భారత్‌లో బంగారం గురించి ప్రజల్లో ఎప్పుడూ ఎక్కువ ఆసక్తి ఉంది. పెళ్లిళ్లు, పండుగలకు కచ్చితంగా బంగారం ఉండాల్సిందే. రాబోయే రెండు సంవత్సరాల్లో గోల్డ్ ధర 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,000 నుండి రూ.1,57,000 వరకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్పిన అత్యధిక అంచనా ప్రకారం రూపాయి బలహీనపడినా, ప్రపంచ మార్కెట్ ధరలు పెరిగితే మాత్రం 10 గ్రాములు రూ.1.57 లక్షలకు చేరే అవకాశం ఉంటుంది. లేకపోతే సాధారణ పరిస్థితుల్లో 10 గ్రాముల ధర రూ.1.30–₹1.40 లక్షల మధ్య ఉండొచ్చు.