First Home loan: మనదేశంలో మొదటి హోమ్ లోన్ ఏ బ్యాంకు ఇచ్చింది? ఎవరికి ఇచ్చింది?

Published : Nov 25, 2025, 02:49 PM IST

First Home loan: ఇప్పుడు బ్యాంకులు భారీగా హోమ్ లోన్లు అందిస్తున్నాయి. కానీ మనదేశంలో మొదటి హోం లోన్ ఏ బ్యాంకు ఇచ్చింది? ఎవరికి ఇచ్చింది? అసలు ఇంటికి రుణం తీసుకోవడం అనేది ఎవరు మొదలు పెట్టారు. 

PREV
14
హోం లోన్ ఇచ్చిన మొదటి బ్యాంకు ఇదే

మనదేశంలో ప్రజలు ఇళ్లు కొనేందుకు హోం లోన్లపైనే ఆధారపడుతున్నారు. కాని ఒకప్పుడు ఇళ్ల కోసం రుణాలు ఇవ్వడం అనే పద్ధతి లేదు. ఆ సమయంలో సాధారణ కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే సంవత్సరాల తరబడి పొదుపు చేయాల్సి వచ్చేది. ఇల్లు కోసం ప్రత్యేకంగా రుణాలు ఇచ్చే సంస్థలు పాత రోజుల్లో లేవు. అటువంటి పరిస్థితుల్లో 1978లో తొలిసారి HDFC బ్యాంకు గృహ రుణాలు అనే కొత్త పనిని ప్రారంభించింది. ఆ సంస్థ నుంచి బయటకు వచ్చిన మొదటి హోమ్ లోన్ భారత ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ రుణం పొందిన వ్యక్తి డీబీ రెమెడియోస్. ఇతను ముంబైకి చెందినవాడు.

24
ఈ నిర్ణయమే దేశాన్నే మార్చింది

HDFC బ్యాంకు కూడా కొత్తగా ప్రారంభమైన రోజులు . ఈ సంస్థ వ్యవస్థాపకుడు హెచ్.టి. పరేఖ్ దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలని కోరుకున్నారు. ప్రజలు పొదుపు చేసిన డబ్బుతోనే ఇళ్లు కట్టుకునే పరిస్థితిని మార్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉన్న విధంగా గృహ రుణాలు అనే కాన్సెప్ట్ ప్రారంభించాలని నిర్ణయించారు. నిజానికి ఈ నిర్ణయం అప్పట్లో చాలా సాహసోపేతమైనదనే చెప్పుకోవాలి. ఎందుకంటేరుణం రజలు సకాలంలో చెల్లిస్తారా? అనే అనుమానాలు బ్యాంకులు, ఆర్థిక నిపుణుల్లో చాలా ఉన్నాయి. అయినప్పటికీ HDFC రిస్క్ తీసుకుంది. ఆ రిస్క్ వల్లే భారత దేశంలో గృహ రుణాల రంగం ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది.

34
ముంబైకి చెందిన వ్యక్తికి

HDFC ఇచ్చిన తొలి రుణం ముంబైకు చెందిన డీబీ రెమెడియోస్ అనే వ్యక్తికే వచ్చింది. ఆయన మలాడ్ ప్రాంతంలో ఒక చిన్న ఫ్లాట్ నిర్మించుకోవాలని అనుకున్నారు. మొత్తం ఖర్చు సుమారు 70,000 రూపాయలు. అందులో 30,000 రూపాయలు రుణంగా కావాలి. అప్పట్లో 30,000 రూపాయలు చిన్న మొత్తం కాదు. ఒక మధ్య తరగతి ఉద్యోగి ఏడాదికి పొందే జీతం కంటే కూడా ఎక్కువే. అయినప్పటికీ HDFC ఆయనకు రుణం మంజూరు చేసింది. ఈ రుణం భారత్‌లో అధికారికంగా నమోదు అయిన మొదటి హోమ్ లోన్. ఈ రుణానికి వడ్డీ రేటు 10.5 శాతం గా నిర్ణయించారు. తర్వాత కొన్ని లెక్కల్లో ఇది 11 శాతం దాకా చూపబడింది. ఏదేమైనా, ఆ రోజుల్లో ఈ రుణం తీసుకోవడం రెమెడియోస్ కుటుంబానికి పెద్ద ఆశీర్వాదంగా మారింది.

44
సమయానికి కట్టడం వల్లే

డీబీ రెమెడియోస్ తీసుకున్న ఈ లోన్ భారతదేశంలో గృహరుణాల పునాది వేసింది. ఆయన రుణం సకాలంలో చెల్లించడం కూడా HDFCకి నమ్మకాన్ని పెంచింది.రుణం ఇచ్చినా ప్రజలు సకాలంలో చెల్లిస్తారన్న నమ్మకం పెరిగింది. దాంతో HDFC మరింత మంది వ్యక్తులకు రుణాలు ఇవ్వడం మొదలుపెట్టింది. కొద్ది సంవత్సరాల వ్యవధిలో వేలాది మంది కుటుంబాలు ఇళ్లు నిర్మించుకోగలిగారు. వారి జీవితాలు మారాయి. దేశంలో గృహ నిర్మాణ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందింది. ఒక వ్యక్తికి ఇచ్చిన రుణం ఒక పెద్ద పరిశ్రమ ఏర్పాటుకు కారణం అయింది.

ఇప్పుడు మనదేశంలో బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్షియల్ సంస్థలు, హౌసింగ్ బోర్డులు.. ఇలా ఎన్నో సంస్థలు గృహ రుణాలు ఇస్తున్నారు. లక్షలాది మంది ఈ రుణాల ద్వారా తమ సొంత ఇళ్లు నిర్మించుకున్నారు. ఇల్లు అనేది కల మాత్రమే కాదు, అది ఎంతోమంది కల. అందుకే భారతదేశ తొలి హోమ్ లోన్ కథ నేటికీ ఎంతో ప్రత్యేకం.

Read more Photos on
click me!

Recommended Stories