Amazon: వాషింగ్ మెషీన్ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టడం ఎందుకు? కేవలం రూ.1500 ఖర్చు చేస్తే సింపుల్, మిని వాషింగ్ మెషీన్ ను మీరు కొనుక్కోవచ్చు. ఈ అద్భుతమైన ఆఫర్ ని అమెజాన్ మీకు అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా వాషింగ్ మెషీన్ పెట్టాలంటే కొంచె స్థలం కావాలి. మళ్లీ దాన్ని ఎక్కడికీ కదపలేం. వాషింగ్ మెషీన్ బరువు కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఎక్కడ పెట్టామో అక్కడే ఉంచి పని చేసుకోవాలి. దీని ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. మినిమం రూ.10 వేలు ఖర్చు చేస్తేనే కాని బేసిక్ మోడల్ కొనలేం. అన్ని బెనిఫిట్స్ ఉన్న వాషింగ్ మెషీన్ కొనాలంటే రూ.30 వేలు కంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి.
25
బ్యాచిలర్స్ కి సరిపోయే వాషింగ్ మెషీన్లు
ఇంత ఖర్చు పెట్టిన మెషీన్ రిపేర్ వచ్చిందంటే రూ.వేలల్లోనే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పైగా అద్దె ఇళ్లలో ఉండే వారు ఇల్లు మారేటప్పుడు వీటిని తీసుకెళ్లడం కూడా చాలా పెద్ద పని.
అద్దె ఇళ్లలో ఉండే వారికి, హాస్టల్స్, రూమ్స్ లో ఉండే బ్యాచిలర్ అమ్మాయిలు, అబ్బాయిలకు ఉపయోగ పడే సింపుల్, మిని పోర్టబుల్ వాషింగ్ మెషీన్లు మార్కెట్లో లభిస్తున్నాయి. ఇవి తక్కువ ధరలోనే లభిస్తాయి. ఇలాంటి మిని వాషింగ్ మెషీన్లను అమెజాన్ ఇప్పుడు తక్కువ ధరకే అందిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
35
సెమీ ఆటోమేటిక్ ఫోల్డింగ్ మినీ వాషింగ్ మెషిన్
ఈ మినీ వాషింగ్ మెషీన్‌ను మడతపెట్టేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించిన తర్వాత మీరు దీన్ని ఎక్కడైనా స్టోర్ చేయవచ్చు. ఇది బట్టలు ఆరబెడుతుంది. విద్యుత్తును కూడా ఆదా చేస్తుంది. ఇది 0.8 కిలోల బరువున్న బట్టలు ఉతకగలదు. ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులకు ఇది సరిపోతుంది. అమెజాన్ లో ఇది కేవలం రూ.1,499లకే లభిస్తోంది.
ఈ మినీ యంత్రం ధర అమెజాన్ లో కేవలం రూ.1,599. ఇది 2 కిలోల బట్టలు ఉతకగలదు. ఇది బట్టలు కూడా ఆరబెట్టగలదు. మీరు ఒంటరిగా ఉంటే మీ గదిలో లేదా ఫ్లాట్‌లో తక్కువ స్థలంలోనే దీన్ని మీరు పెట్టుకోవచ్చు.
టైమింగ్ బెల్ట్ మినీ వాషింగ్ మెషిన్
మీరు అసలు వాషింగ్ మెషిన్ వద్దనుకుంటే టైమింగ్ బెల్ట్ తీసుకోండి. మీరు దానిని ఏ బకెట్‌లోనైనా పెట్టవచ్చు. దీనికి ISI కాపర్ మోటార్ ఉంటుంది. ఇది బట్టలు బాగా ఉతుకుతుంది. దీనికి ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది. అమెజాన్ లో దీని ధర కేవలం రూ.2,745.
55
DMR పోర్టబుల్ వాషింగ్ మెషిన్
మీరు కాస్త డబ్బులు పెట్టగలిగితే అమెజాన్ లో రూ.4,999 కి DMR పోర్టబుల్ వాషింగ్ మెషిన్ తీసుకోండి. ఇది దుస్తులు బాగా ఉతుకుతుంది. కాని ఆరబెట్టదు. ఇది 3 కిలోల బరువైన దుస్తులు ఈజీగా ఉతకగలదు. దీనికి కూడా ఒక సంవత్సరం వారంటీ ఉంది.
ప్రస్తుతం అమెజాన్ లో ఈ మిని పోర్టబుల్ వాషింగ్ మెషీన్లు ట్రెండింగ్ లో ఉన్నాయి. ట్రిప్ లకు వెళ్లడానికి, రూమ్స్ లో ఉండే బ్యాచిలర్స్ కి ఇవి బాగా ఉపయోగపడతాయి.