కవాసకి వెర్సిస్ బైక్ లో ఎల్ఈడీ లైటింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ ఉన్నాయి. ఇన్ని బెస్ట్ ఫీచర్లు ఉండటం వల్ల రైడర్‌కు చాలా సౌకర్యంగా ఉంటుంది.
రెండు రంగుల్లో కవాసకి వెర్సిస్ 650
సాహస యాత్రలకు వెళ్లేవారికి ఇది బెస్ట్ బైక్. దీని ముందు భాగం చాలా షార్ప్‌గా ఉంటుంది. ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ రేడియేటర్ గార్డులుగా పనిచేస్తాయి. కవాసకి ఈ బైక్‌ను రెండు రంగుల్లో అందిస్తుంది. మెటాలిక్ మ్యాట్ డార్క్ గ్రే, మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్.