నవంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ; ఆర్బీఐ హాలిడేస్ లిస్ట్ ఇదే..

First Published | Oct 27, 2023, 5:40 PM IST

నవంబర్ నెల బ్యాంకు హాలిడేస్   లిస్టును ఆర్బీఐ విడుదల చేసింది. దీని ప్రకారం నవంబర్‌లో కన్నడ రాజ్యోత్సవం, దీపావళి వంటి ముఖ్యమైన పండుగల కారణంగా మొత్తం 15 రోజులు సెలవులు రానున్నాయి. 
 

 అక్టోబర్ నెల ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే, నవంబర్ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా..? ప్రతి కొత్త నెల ప్రారంభానికి ముందు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు హాలిడేస్ లిస్టును విడుదల చేస్తుంది. దీని ప్రకారం నవంబర్ నెలకి కూడా  హాలిడేస్ లిస్టును ఆర్బీఐ విడుదల చేసింది. దాని ప్రకారం నవంబర్ నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవు రానుంది. 
 

నవంబర్ నెలలో కన్నడ రాజ్యోత్సవ, దీపావళి వంటి ముఖ్యమైన పండుగలు కలుపుకొని ఈ నెలలో బ్యాంకులకు ఎక్కువ సెలవులు  ఉన్నాయి. అయితే  ఆయా ప్రాంతీయ వేడుకలు,  పండుగల ప్రకారం సెలవులు కేటాయించబడతాయి. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు పబ్లిక్ అండ్ గెజిటెడ్ సెలవులు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు అన్ని ఆదివారాలు, రెండవ ఇంకా నాల్గవ శనివారాలు సెలవులు ఉంటుంది. సెలవు రోజుల్లో ఆన్‌లైన్ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే, బ్యాంకు పనికోసం బ్యాంకులకు వెళ్లే ముందు   హాలిడేస్ లిస్టును  చెక్ చేయడం మంచిది.
 


బ్యాంక్ హాలిడేస్  RBI మూడు వర్గాలుగా విభజించింది. RBI హాలిడేస్ లిస్టులోని  సెలవులు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ, విదేశీ బ్యాంకులు, సహకార బ్యాంకులు ఇంకా  ప్రాంతీయ బ్యాంకులకు వర్తిస్తాయి.

మీరు నవంబర్ నెలలో బ్యాంకు సంబంధించి ఏదైనా పని కోసం వెళ్ళవలసి  వస్తే ముందుగా  హాలిడేస్  లిస్ట్ చెక్  చేయడం మంచిది.  లోన్  కి సంబంధించిన లేదా ఈఎంఐ  లేదా  మరేదైనా ఇతర పని కోసం మీరు బ్యాంకుకి వెళ్ళవలసి వస్తే సెలవుల్లో జాగ్రత్త వహించండి. లేదంటే బ్యాంకుకు వెళ్లి మీ సమయం ఇంకా శ్రమ రెండూ వృధా అవుతాయి. సెలవు రోజున ఏటీఎం సేవలకు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు ఎలాంటి అంతరాయం ఉండదు. 

నవంబర్ హాలిడేస్  లిస్ట్  :
నవంబర్ 1: కన్నడ రాజ్యోత్సవం కుట్, కర్వా చౌత్ (కర్ణాటక, ఇంఫాల్,  సిమ్లాలో బ్యాంకులకు సెలవు)
నవంబర్ 5: ఆదివారం
నవంబర్ 10: గోవర్ధన్ పూజ, లక్ష్మీ పూజ, దీపావళి (షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు)
నవంబర్ 11 : రెండవ శనివారం
నవంబర్ 12 : ఆదివారం &  దీపావళి (తెలంగాణలోని అన్ని బ్యాంకులకు సెలవు)
నవంబర్ 13: గోవర్ధన్ పూజ, లక్ష్మీ పూజ, దీపావళి (అగర్తల, డెహ్రాడూన్, గాంగ్టక్, ఇంఫాల్, జైపూర్, కాన్పూర్, లక్నోలో బ్యాంకులకు  సెలవు)
నవంబర్ 14: దీపావళి, విక్రమ్ సంవత్ నూతన సంవత్సరం, లక్ష్మీ పూజ (అహ్మదాబాద్, బెల్పూర్, బెంగుళూరు, గ్యాంగ్‌టక్, నాగ్‌పూర్, ముంబైలో సెలవు )

నవంబర్ 15: భాయ్ దూజ్, చిత్రగుప్త జయంతి, లక్ష్మీ పూజ, నింగల్ చికుబా, భారతి దితి (గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో అండ్  సిమ్లా) 
నవంబర్ 19: ఆదివారం 
నవంబర్ 20: ఛత్ (పాట్నా, రాంచీలలో బ్యాంకులకు సెలవు )
నవంబర్ 23: సెంగ్ కుట్ స్నెమ్/ఇగాస్ బగ్వాల్ (డెహ్రాడూన్, షిల్లాంగ్‌లలో బ్యాంకులకు సెలవు)
నవంబర్ 25: నాల్గవ శనివారం
నవంబర్ 26: ఆదివారం
నవంబర్ 27: గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ ( త్రివేండ్రం అండ్  షిల్లాంగ్ మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు)
నవంబర్ 30: కనకదాస జయంతి (బెంగుళూరులోని బ్యాంకులకు సెలవు)

Latest Videos

click me!