DMart: అంత తక్కువకు అమ్ముతూ డీమార్ట్ వేల కోట్ల ఆదాయం ఎలా గడిస్తోంది?

Published : Nov 16, 2026, 08:29 AM IST

DMart: తక్కువ ధరకు వస్తువులు అమ్మితే లాభాలు ఎలా? పైగా అదే వ్యాపారంతో వేల కోట్లు ఎలా ? ఈ ప్రశ్నకు సమాధానమే డీమార్ట్ వ్యాపారం. భారీగా సరుకుల కొనుగోలు నుంచి మెయింటెనెన్స్ వరకు.. డీమార్ట్ విజయానికి దోహదపడుతున్న సీక్రెట్స్ ఏంటో చూద్దాం.

PREV
15
డీమార్ట్ వ్యాపార రహస్యం

భారతదేశంలోని అగ్రగామి రిటైల్ సంస్థల్లో డీమార్ట్ ఒకటి. దీని మాతృ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్. ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ భారతీయ వినియోగదారుల కొనుగోలు అలవాట్లను గమనించి ఈ వ్యాపారాన్ని రూపొందించారు. నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకు అందిస్తే ఎక్కువ మందిని ఆకర్షించవచ్చనేదే ఆయన ఆలోచన. 2000లో ప్రారంభమైన ఈ సంస్థ, 2002లో ముంబైలో మొదటి స్టోర్‌ను తెరిచింది. వేగంగా స్టోర్లు తెరవడం కన్నా లాభదాయకమైన బిజినెస్ మోడల్‌ను సృష్టించడంపైనే డీమార్ట్ దృష్టి పెట్టింది.

25
బల్క్ పర్చేజింగ్

బల్క్ పర్చేజింగ్ అనేది డీమార్ట్ ముఖ్యమైన వ్యూహాల్లో ఒకటి. చిన్న షాపులు తక్కువ పరిమాణంలో కొనుగోలు చేసినప్పటి కంటే వేలాది స్టోర్లకు సరిపడా సరుకును ఒకేసారి కొనుగోలు చేయడం ద్వారా కంపెనీకి మంచి ధర లభిస్తుంది. అంతేకాకుండా తయారీదారులతో ధర, కొనుగోలు షరతులపై చర్చలు జరిపే అవకాశం కూడా ఉంటుంది. దీంతో కొనుగోలు ఖర్చు తగ్గి, వినియోగదారులకు తక్కువ ధరకు వస్తువులు విక్రయించగలుగుతారు.

35
ఖర్చుల నియంత్రణ

వస్తువులను కొనడమే కాకుండా వాటిని నిల్వ చేసి స్టోర్లకు చేరవేయడంపై డీమార్ట్ దృష్టి పెట్టింది. కంపెనీ 2024-25 వార్షిక రిపోర్టు ప్రకారం, 75 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, 10 ప్యాకింగ్ కేంద్రాలు పనిచేశాయి. ఇలాంటి వ్యవస్థ రవాణా, స్టోరేజ్ ఖర్చులను అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా దుకాణం అద్దె, విద్యుత్, ఉద్యోగుల జీతాలు లాంటి రోజువారీ ఖర్చులను కూడా జాగ్రత్తగా నిర్వహించడం డీమార్ట్ బిజినెస్ ప్లాన్‌లో భాగమే.

45
తక్కువ లాభం

రూ.90కి కొని రూ.100కి అమ్మితే వచ్చే రూ.10 స్థూల లాభం మాత్రమే. స్టోర్ నిర్వహణ, రవాణా, సిబ్బంది వేతనాలు వంటివి పోనూ నికర లాభం వస్తుంది. ప్రతి వస్తువుపై ఎక్కువ లాభం ఆశించే బదులు, తక్కువ మార్జిన్‌తో ఎక్కువ వస్తువులు విక్రయించడం ద్వారా మొత్తం ఆదాయాన్ని, లాభాలను పెంచుకోవడమే డీమార్ట్ పద్ధతి. ఇదే తక్కువ ధర బిజినెస్ వ్యూహంలో కీలకమైనది.

55
స్టోర్ల విస్తరణ

డీమార్ట్ తన దుకాణాల సంఖ్యను నిరంతరం పెంచుకుంటోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 85 కొత్త స్టోర్లు తెరవగా, 2026 మార్చి నాటికి మొత్తం 500కు చేరినట్లు సమాచారం. 2026 సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే నాటికి మరో 15 స్టోర్లు చేరి మొత్తం సంఖ్య 518కి చేరినట్లు తెలుస్తోంది. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడం, అనవసర ఖర్చులను తగ్గించడం, నాణ్యతతో కూడిన సరైన ధర అందించడం, లాభం ఖాయమయ్యాకే విస్తరణ చేయడం లాంటివి ఈ మోడల్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు.

Read more Photos on
click me!

Recommended Stories