గత ఏడాది డిసెంబర్‌లో రూ.100 పెంచగా
గతేడాది చివరి నెలలో ఇండియన్ ఆయిల్ కంపెనీ కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను సవరించింది. దీంతో డిసెంబర్‌లో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.100 అధికంగా మారింది. అయితే అప్పట్లో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి పెంపుదల లేకపోవడంతో ఈసారి కూడా ధరను అలాగే ఉంచడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం. వాణిజ్య సిలిండర్ల ధర తగ్గింపు రెస్టారెంట్లు, హోటళ్లు, తినుబండారాలు, టీ స్టాల్స్ నడుపుతున్న వ్యాపారులకు ఎంతో ఊరటనిస్తుంది.