ఆటో ఎక్స్‌పో 2025: మహీంద్రా నుంచి అదిరిపోయే 5 కొత్త ఎలక్ట్రిక్ SUVలు

First Published | Jan 15, 2025, 1:33 PM IST

ఆటో ఎక్స్‌పో 2025: జనవరి 17 నుంచి 22 వరకు జరగనున్న ఆటో ఎక్స్‌పో 2025లో మహీంద్రా 5 ఎలక్ట్రిక్ SUVలను ఆవిష్కరించనుంది. అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న BE 6, XEV 9e, ఎలక్ట్రిక్ XUV 700 తదితర వెహికల్స్ ఈ ఎక్స్‌పోలో సందడి చేయనున్నాయి. ఆ కార్ల ఫీచర్లు, ధరలు తదితర వివరాలు తెలుసుకుందాం రండి.   

2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో మహీంద్రా కంపెనీ పాల్గొంటుందని కంపెనీ ప్రతినిధులు ధృవీకరించారు. ఎందుకంటే మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ముందంజలో ఉండటమే లక్ష్యంగా పెట్టుకుంది. అందువల్ల ఈ ఆటో ఎక్స్‌పో మంచి వేదిక అవుతుందని మహీంద్రా కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా నుంచి అనేక ఎలక్ట్రిక్ SUV మోడళ్లను మనం చూడబోతున్నాం. ఐదు మహీంద్రా ఎలక్ట్రిక్ SUVల వివరాలను పరిశీలిద్దాం రండి.

1. మహీంద్రా BE 6

మహీంద్రా BE 6, XEV 9e అనే రెండు ఎలక్ట్రిక్ SUVలను ఆవిష్కరించింది. BE 6 ఆకర్షణీయమైన మూడు వెర్షన్లలో అందుబాటులో ఉంది. అవి ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3. వీటి ఎక్స్-షోరూమ్ ధర రూ.18.9 లక్షలుగా ఉండి. 

BE 6 రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. అవి 59 kWh, 79 kWh. ఈ వెహికల్ 280 హార్స్‌పవర్, 380 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. చిన్న బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 535 కి.మీ వరకు వెళ్తుంది.


2. మహీంద్రా XEV 9e

XEV 9e విషయానికొస్తే ఇది మూడు వెర్షన్లలో వస్తుంది. అవి ప్యాక్ వన్, ప్యాక్ టూ, ప్యాక్ త్రీ. ఇది XUV 700 ఎలక్ట్రిక్ కూపే వెర్షన్. మార్కెట్ లో ఎక్స్-షోరూమ్ ధర రూ.21.9 లక్షలుగా ఉంది. దీని టాప్ వెర్షన్ ధర రూ. 30.5 లక్షలు.

ఈ కారు ఇంటీరియర్ XUV 700ని పోలి ఉంటుంది. పనోరమిక్ గ్లాస్ రూఫ్, 16-స్పీకర్ హర్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

3. మహీంద్రా XUV 700 EV

XEV 7e అనేది భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో మరో ప్రతిష్టాత్మక ఉత్పత్తి. దీన్ని XUV 700 ఎలక్ట్రిక్ అని కూడా పిలుస్తున్నారు. ఈ కారులో హైలైట్ ఫీచర్లు ఏంటంటే LED బార్, LED DRLలు, హెడ్‌ల్యాంప్ క్లస్టర్.

ఈ క్యాబిన్‌లో ట్రిపుల్ స్క్రీన్ సిస్టమ్, స్టీరింగ్ వీల్‌పై లోగో, కెప్టెన్ సీట్లు, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, సీట్ వెంటిలేషన్, పనోరమిక్ సన్‌రూఫ్, ADAS, 360 డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. BE6, XEV 9E లలో ఉపయోగించిన 59 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్‌లు SUVలో కూడా ఉంటాయి. XEV 7e సఫారీ EVతో పోటీ పడే వెహికల్. 

4. మహీంద్రా XUV 3XO EV

మహీంద్రా XUV 3XO కారును బేస్ చేసుకొని ఎలక్ట్రిక్ SUVని తయారు చేస్తోంది. ఇది XUV 400 EV స్థానంలో వస్తుంది. XUV 400 పవర్‌ట్రెయిన్ అలాగే ఉంటుంది. ఇందులో 34.5 kWh, 39.4 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. 150 PS, 310 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. XUV 3XO EV కారును 2025 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్నారు. 

5. RALL-E

RALL-E కాన్సెప్ట్ అనే ఈ కారు మహీంద్రా నుంచి వచ్చిన మరో ఎలక్ట్రిక్ SUV మోడల్. ఇది BE 6 ఆఫ్-రోడ్ వెర్షన్. ఈ కారును మొదట మహీంద్రా EV ఫ్యాషన్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. 

ఈ కాన్సెప్ట్ పసుపు, నియాన్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. బంపర్‌లో పెద్ద హెడ్‌లైట్, LED DRL డిజైన్ ఉన్నాయి. ఆఫ్ రోడ్ టైర్లు, స్కిడ్ ప్లేట్లు కూడా ఇందులో ఉన్నాయి.

Latest Videos

click me!