ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి కోటీశ్వరుడిగా మారొచ్చు..! కానీ.. ఈ 5 తప్పులు చచ్చినా చేయకూడదు

Published : Jan 31, 2026, 09:00 AM IST

Wealth: మధ్యతరగతి వ్యక్తులు తరచుగా చేసే ఐదు ఫైనాన్షియల్ మిస్టేక్‌లు వాళ్లను కోటీశ్వరుడిగా మార్చడంలో అడ్డుపడుతున్నాయని బిజినెస్ నిపుణులు అంటున్నారు. అధిక మొత్తంలో పొదుపు ఖాతాలో డబ్బు ఉంచడం, ఆలోచించకుండా EMIలు తీసుకోవడం.. 

PREV
15
ఫైనాన్షియల్ మిస్టేక్‌లు

మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి అడ్డుపడే ఐదు ఫైనాన్షియల్ మిస్టేక్‌లు వాళ్లను కోటీశ్వరులు కాకుండా అడ్డుపడుతున్నాయని బిజినెస్ నిపుణులు అంటున్నారు. మధ్యతరగతి వ్యక్తులు తమ చిన్నచిన్న పొరపాట్ల కారణంగా అదే స్థితిలో కొనసాగుతున్నారన్నారు. వాటిని వెంటనే సరిదిద్దుకోవాలని చెబుతున్నారు.

25
మొదటి మిస్టేక్ ఏంటంటే..

మొదటి మిస్టేక్ ఏంటంటే.. అధిక మొత్తంలో డబ్బును కేవలం సేవింగ్స్ ఖాతాలోనే ఉంచడం. ద్రవ్యోల్బణం వల్ల ఈ డబ్బు విలువ తగ్గిపోతుంది. మూడు నెలల ఖర్చులకు సరిపడా డబ్బును మాత్రమే సేవింగ్స్ ఖాతాలో ఉంచి.. మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల లాంటి లిక్విడ్ ఇన్వెస్ట్‌మెంట్లలో పెట్టడం మంచిది.

35
EMIలు తీసుకోవడం

రెండోది.. అనవసరమైన వస్తువుల కోసం EMIలు తీసుకోవడం. ధనవంతులు ముందు పెట్టుబడులు పెట్టి.. వాటి రాబడితో కొనుగోలు చేస్తుంటారు. EMIలు మొత్తం జీతంలో 30 శాతం మించకూడదు. ఇల్లు, ప్లాటు లాంటి ఆస్తుల కోసం EMIలు మంచివి.

45
మూడోది ఒకే ఆదాయ వనరుపై..

మూడోది ఒకే ఆదాయ వనరుపై ఆధారపడటం. ఉద్యోగం పోతే ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా సెకండ్ లేదా థర్డ్ ఆప్షన్ పెట్టుకోవడం ముఖ్యం. నాలుగోది నెలవారీ ఖర్చులను ట్రాక్ చేయకపోవడం. ఖర్చులను గుర్తించడం ద్వారా అవసరమైనవి, అనవసరమైనవి తెలుసుకొని.. దానికి తగ్గట్టుగా అనవసరమైన వాటిని తగ్గించుకోవచ్చు. జీతం రాగానే 20 శాతం వేరొక అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసి పెట్టుబడికి పెట్టాలి.

55
బీమాను నిర్లక్ష్యం చేయడం

చివరిగా బీమాను నిర్లక్ష్యం చేయడం. ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. ఆరోగ్య బీమా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ ఆస్పత్రి ఖర్చులు భరిస్తుంది. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసరం. చాలా కుటుంబాలలో కేవలం ఒకే వ్యక్తి సంపాదిస్తుంటారు. వారికి ఏదైనా రిస్క్ జరిగితే కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. తక్కువ ప్రీమియంతో అధిక కవరేజ్(కోట్ల రూపాయల్లో) అందించే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories