Stocks: డబ్బులు పొదుపు చేసుకోవాలంటే చాలామందికి మొదటిగా గుర్తొచ్చేది మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్‌డీలు.. లేదా పోస్టాఫీస్ స్కీంలు.. అయితే స్టాక్ మార్కెట్‌లో కూడా మంచి రాబడిని పొందొచ్చునని ఎవరు గుర్తించరు.. ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం..
స్టాక్ మార్కెట్‌లోనూ చక్కటి రాబడిని పొందొచ్చు. కానీ చాలామందికి స్టాక్ మార్కెట్ అంటేనే భయపడతారు. ఓ మంచి స్టాక్‌ను మనం ఎన్నుకోవాలంటే.. కచ్చితంగా ఆ కంపెనీ చరిత్ర, వృద్ది, ఆదాయం లాంటివి చూడాలి. ఇప్పుడు మనం ఓ ఏడు ఇండియన్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఏడు భారతీయ కంపెనీలైన హిందుస్థాన్ జింక్, వేదాంత, గ్లాండ్ ఫార్మా, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్స్ లిమిటెడ్, సోమానీ సిరామిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సాజిలిటీ ఇండియా అద్భుతమైన Q3 ఫలితాలను పోస్ట్ చేశాయి.
25
హిందుస్థాన్ జింక్, వేదాంత
హిందుస్థాన్ జింక్ నికర లాభం Q3లో రూ. 3,879 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 2,647 కోట్లతో పోలిస్తే ఇది భారీ వృద్ది. HSBC, జెఫ్రీస్ లాంటి బ్రోకరేజ్‌లు రూ. 750 టార్గెట్ ఇచ్చాయి. వేదాంత కూడా Q3లో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 60 శాతం పెరిగి రూ. 7,807 కోట్లకు చేరుకుంది. ప్రముఖ బ్రోకరేజ్‌లు ఈ స్టాక్‌కు కూడా Buy రేటింగ్ ఇచ్చాయి.
35
గ్లాండ్ ఫార్మా షేర్
హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ గ్లాండ్ ఫార్మా Q3లో మంచి ఫలితాలను ప్రకటించింది. నికర లాభం రూ. 261 కోట్లకు చేరుకుందని తెలిపింది. మోతీలాల్ ఓస్వాల్ రూ. 2,050 టార్గెట్ దీనికి ఇచ్చింది. GRSE Q3లో అమ్మకాలలో రూ. 1,896 కోట్లు నమోదు చేసింది. నికర లాభం రూ. 171 కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 7.15 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. యాంటిక్ బ్రోకరేజ్ రూ. 3,026 టార్గెట్ రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుత ధర నుంచి 15 శాతం అప్‌సైడ్ ఉందని సూచించింది.
సోమానీ సిరామిక్స్ Q3లో బలమైన ఫలితాలను సాధించింది. నికర లాభం రూ. 17 కోట్లు నమోదు చేసింది. ఛాయిస్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ రూ. 575 టార్గెట్ ఇచ్చింది. డిఫెన్స్ రంగ సంస్థ BEL Q3లో అంచనాలను మించిపోయింది. నికర లాభం రూ. 1,580 కోట్లకు చేరుకుంది. CLSA, జెఫ్రీస్, జేపీమోర్గాన్ లాంటి బ్రోకరేజ్‌లు రూ. 522 నుంచి రూ. 565 వరకు టార్గెట్ పెట్టాయి.
55
సాజిలిటీ ఇండియా షేర్..
సాజిలిటీ ఇండియా కూడా Q3లో మంచి ఫలితాలను ప్రకటించింది. నికర లాభం రూ. 268 కోట్లగా ఉంది. ICICI సెక్యూరిటీస్, JM ఫైనాన్షియల్, మోతీలాల్ ఓస్వాల్ లాంటి బ్రోకరేజ్‌లు రూ. 66 నుంచి రూ. 76 వరకు టార్గెట్ ఇచ్చాయి. 55 శాతం అప్‌సైడ్ మూమెంటమ్ ఉందని సూచించాయి. కాగా, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్ రిస్క్‌తో కూడుకున్నది.. డబ్బు పెట్టే ముందు కచ్చితంగా మీ బిజినెస్ అడ్వైజర్‌ను సంప్రదించండి.