సైబర్ నేరాలపై అవగాహన ఉన్న వారు ఫ్రాడ్ కాల్స్, మెసేజ్ ల నుంచి జాగ్రత్తగానే ఉంటారు. ఎందుకంటే చాలా ట్రాన్సాక్షన్స్ ఓటీపీల ద్వారానే జరుగుతాయి. అందుకే ఓటీపీలు ఎవరికీ షేర్ చేయకుండా ఉంటే సేఫ్ అనుకుంటారు. అయితే హ్యాకర్లు తలచుకుంటే మీ ఫోన్ వచ్చిన ఓటీపీలు, మెసేజ్ లు కూడా చూడగలరు.
ఇలా జరగకుండా ఉండాలంటే మీ ఫోన్ లో Lock Screen Notifications ఆఫ్ చేయండి.
మీ ఫోన్ లో Settings ఓపెన్ చేయండి.
Notifications లోకి వెళ్లండి.
Lock Screen Notifications ఆప్షన్ పై క్లిక్ చేసి ఆఫ్ చేయండి.