లీటరుకు 34 కి.మీ. మైలేజ్ ఇచ్చే రూ.4 లక్షల సూపర్ కారు ఇది

First Published | Nov 9, 2024, 12:47 PM IST

34 km Mileage in just Rs.4 lakh car : తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కారు కావాలనుకునే వారికి  మారుతి ఆల్టో K10 సరిగ్గా సరిపోతుంది. లీటరు ఫ్యూయల్ కు ఏకంగా 34 కిలో మీటర్ల మైలేజీ ఇచ్చే ఈ కారు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో తక్కువ ధరకే మంచి కారు కావాలని అందరూ కోరుకుంటున్నారు. కారు మంచిగా, చూడ్డానికి సూపర్ గా ఉండటమే కాకుండా మంచి మైలేజీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీరు కూడా అలాంటి కారు కోసం చూస్తుంటే మారుతి కొత్త ఆల్టో K10 మీకు బాగా సరిపోతుంది. ఈ కారులో పవర్ఫుల్ ఇంజిన్, మంచి మైలేజీతో పాటు దాదాపు లెెటెస్ట్ కార్లలో ఉంటే అన్ని ఫీచర్లు ఉన్నాయి. లీటరు 34 కిలో మీటర్ల మైలేజీ ఇచ్చే ఈ మారుతి కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త మారుతి ఆల్టో K10 ఫీచర్లు

అద్భుతమైన ఫీచర్లు, మంచి మైలేజీని అందించే సూపర్ కారును మారుతి మార్కెట్ లోకి తీసుకువచ్చింది. కొత్త మారుతి ఆల్టో K10.  ఈ కారులో చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి. వాటిలో స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, కారు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకునే వింగ్ మిర్రర్స్, 2 స్పీకర్లు, ఇంపాక్ట్ సెన్సిటివ్ డోర్ అన్‌లాక్ వంటివి ఉన్నాయి. ఇవి కాకుండా AUX, USB పోర్ట్, సెంట్రల్ లాకింగ్, రూఫ్ ఆంటెన్నా, ఫ్రంట్ పవర్ విండో, బ్లూటూత్ కనెక్షన్ తో 2-DIN SmartPlay ఆడియో సిస్టం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.


కొత్త మారుతి ఆల్టో K10 ఇంజిన్

కొత్త మారుతి ఆల్టో K10లో పవర్ఫుల్ ఇంజిన్ ఉంది. మంచి మైలేజీతో పాటు S-CNG వెర్షన్ కూడా దొరుకుతుంది. CNG వెర్షన్ లో 1.0 లీటర్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజిన్ ఉంది. ఇది 5300 rpm వద్ద 41.7 kW పవర్, CNG మోడ్ లో 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ ఇస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. లీటరుకు 33.85 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

ఆల్టో K10

కొత్త మారుతి ఆల్టో K10 ధర

తక్కువ ధర, పవర్ఫుల్ ఇంజిన్, మంచి మైలేజీకి మారుతి ఆల్టో K10 పేరుగాంచింది. కొత్త మారుతి ఆల్టో కే10 రూ. 3.99 లక్షల ఎక్స్ షో రూమ్ ధర నుంచి  5.96 లక్షల మధ్య ధరలో అందుబాటులో ఉంది. మారుతి ఆల్టో కే10 వేరియంట్లు: ఇది నాలుగు విస్తృత వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అవి  Std, LXi, VXi, VXi Plus. సీఎన్జీ వేరియంట్లు కూడా ఉన్నాయి. 

Latest Videos

click me!