Phone number Block: ఇప్పుడు అవసరమైన ఫోన్ కాల్స్ కన్నా అనవసరమైన కాల్స్ అధికంగా వస్తాయి. స్పామ్ కాల్స్ వల్ల ఎంతో టైమ్ వేస్ట్ అవుతుంది. వీటి నుంచి ప్రజలను కాపాడేందుకు ట్రాయ్ గట్టి నిర్ణయం తీసుకుంది. ఏకంగా 21 లక్షల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసింది.
ఇప్పుడు ఫోన్ రింగయితే చాలు తెలిసిన వారి కన్నా స్పామ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. మోసపూరిత మెసేజ్‌లు కూడా అధికంగానే వస్తాయి. ఈ కాల్స్ భరించలేక వినియోగదారులు ఎంతో మంది ట్రాయ్ కు ఫిర్యాదు చేశారు. దీంతోట్రాయ్ కఠిన చర్యలు తీసుకుంది. గత ఏడాదిలో 21 లక్షల మొబైల్ నంబర్లను శాశ్వతంగా బ్లాక్ చేసింది. మోసాలకు పాల్పడిన లక్ష సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది.
24
కొత్త సిమ్ లతో కాల్స్
DND (డూ నాట్ డిస్టర్బ్) యాప్‌లో యూజర్లు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ట్రాయ్ చర్యలు తీసుకుంది. టెలికాం కంపెనీలు ఆ నంబర్లను విచారించి స్పామ్ నంబర్లను శాశ్వతంగా డిస్‌కనెక్ట్ చేశాయి. స్పామ్ నంబర్లు బ్లాక్ అయినా, మోసగాళ్లు కొత్త సిమ్‌లతో కాల్స్ చేసే అవకాశం ఉంది. అందుకే రిపోర్ట్ చేయడమే సరైన పరిష్కారం అని ట్రాయ్ చెబుతోంది.
34
మీరు కూడా రిపోర్టు చేయండి
ట్రాయ్ చెబుతున్న ప్రకారం మీ ఫోన్లో DND యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనిలో స్పామ్ కాల్స్, మెసేజ్‌ల గురించి రిపోర్ట్ చేయాలి. ఇప్పటికే ఎన్నోసార్లు మొబైల్ యూజర్లను ట్రాయ్ కోరింది. వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు, OTP, UPI పిన్ పంచుకోవద్దని హెచ్చరించింది. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే కట్ చేయమని కూడా చెప్పింది. ఆన్‌లైన్ మోసాలు జరిగితే 1930 హెల్ప్‌లైన్ లేదా సైబర్‌క్రైమ్.gov.inలో ఫిర్యాదు చేయాలి.
కాల్స్ వల్లే సైబర్ మోసాలు అధికమైపోతాయి. టెలికాం శాఖ త్వరలో మొబైల్ నంబర్ వ్యాలిడేషన్ (MNV) అనే కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. ఈ సిస్టమ్, మొబైల్ నంబర్ వాడుతున్న వ్యక్తి, KYCలో రిజిస్టర్ అయిన వ్యక్తేనా అని నిర్ధారిస్తుంది. దీనివల్ల నకిలీ సిమ్‌లు, ఫేక్ ఐడీ నంబర్లు తగ్గుతాయి. రాబోయే నెలల్లో ఈ ప్లాట్‌ఫారమ్ అమలవుతుందని అంచనా. ఇది సైబర్ మోసాలను అరికట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది.