2024 భారతదేశానికి ఒక ముఖ్యమైన సంవత్సరంగా నిలిచింది. వివిధ రంగాల్లో చారిత్రాత్మక విజయాలు నమోదయ్యాయి. ప్రధానమంత్రి విక్షిత్ భారత్ అనే దార్శనికతతో భారతదేశం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తోంది. క్రీడలు, సినిమాలు, షాపింగ్ ఇలా ఏ సందర్బంలోనైనా పేమెంట్స్ చేయడానికి డిజిటల్ యాప్స్ నే మనం వాడుతున్నాం కదా. అందుకే పన్ను వసూలులో రికార్డ్ స్థాయిలో జరిగింది.
2024 సంవత్సరంలో డిజిటల్ ఇండియా ఉద్యమం కొత్త ఊపును సంతరించుకుంది. UPI లావాదేవీలు చరిత్రలో ఎన్నడూ లేని గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 16.5 బిలియన్ డాటర్లు.. అంటే రూ. 1650 కోట్లకు పైగా UPI లావాదేవీలు ఈ సంవత్సరంలో జరిగాయి.
ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రదేశాల్లో కూడా ఆఫ్‌లైన్‌లో UPI చెల్లింపులు చేసే సదుపాయం వచ్చేసింది. *99# అనే అధికారిక USSD కోడ్‌ను డయల్ చేసి UPI లావాదేవీలను చేసేయొచ్చు. ఈ సేవను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహిస్తుండటంతో పూర్తిగా మీ డబ్బుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
UPI 123Pay, UPI Lite ఆప్షన్ల ద్వారా జరిగే లావాదేవీల పరిమితిని రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇటీవల పెంచింది. UPI 123Pay ద్వారా ఇప్పుడు రూ.10,000 వరకు మీరు మీ ఫ్రెండ్స్ కి నిర్భయంగా మనీ సెండ్ చేసుకోవచ్చు. అదే విధంగా UPI Lite వాలెట్ ద్వారా రూ.5,000 వరకు ఖర్చు చేయవచ్చు.
ఇప్పుడు బ్యాంక్ అకౌండ్ లేకుండా కూడా UPI ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ సదుపాయం ద్వారా మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు తమ బ్యాంక్ ఖాతాను లింక్ చేయకుండానే డిజిటల్‌గా చెల్లింపులు చేయవచ్చు. Google Pay యాప్‌లోని UPI సర్కిల్ అనే ఈ సదుపాయం కూడా UPI లావాదేవీలు పెరగడానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఇన్ని వేల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర ప్రభుత్వం కూడా ఊహించి ఉండదు.